పెదకాపు ఓ అరుదైన చిత్రం

కొత్త హీరో విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ద్వారక క్రియేషన్స్‌ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సెప్టెంబర్…

కొత్త హీరో విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ద్వారక క్రియేషన్స్‌ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సెప్టెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో ‘పెదకాపు-1’ విశేషాలని పంచుకున్నారు.

పెదకాపు పై ఇంత మంచి బజ్ రావడం ఆనందంగా వుంది. పెద్ద సినిమా అవుతుందనే నమ్మకంతోనే మొదటి నుంచి పెద్దగానే చేశాం. కొత్తవాళ్లతోనే వర్క్ అవుట్ అయ్యే కథ ఇది. ఈ కథకు ఒక సామాన్యుడు కావాలి. కొత్తవాడైతే దానికి సహజత్వం వస్తుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ సినిమాలు అరుదుగా వుంటాయి. అలాంటి అరుదైన చిత్రంగా పెదకాపు నిలుస్తుంది. ఈ సినిమా తర్వాత ద్వారక సంస్థ జర్నీ మారుతుంది.

ప్రతి కథలో బలవంతుడు బలహీనుడు మధ్య పోరాటం వుంటుంది. ఇందులోకి వచ్చేసరికి నేటివిటీ తోడైయింది. ఈ కథ తెరపై చూస్తున్నపుడు ఒక సినిమాలా కాకుండా నిజ జీవితాన్నే తెరపై చూస్తున్న అనుభూతి కలుగుతుంది. శ్రీకాంత్ రాసిన మాటలు గుచ్చుకుంటాయి. సినిమా చూస్తున్నపుడు జీవితంలో నెగ్గాలంటే ఒక సామాన్యుడు ఇంత పోరాటం చేయాలా అనిపిస్తుంది. సినిమా చూసి బయటికి వెళ్తున్నప్పుడు నిజమే కదా.. మనం ఎందుకు పోరాటం చేయకూడదనిపిస్తుంది.

ఈ కథ అనుకున్నప్పుడే రెండు పార్టులు గా అనుకున్నాం. ఇదొక చరిత్ర, ఒక సామాన్యుడు, అసమాన్యుడు కావడం ఒక పూటలో జరగదు. ఈ పోరాటంలో చాలా సవాళ్ళు వుంటాయి. ఇది రెండు పార్టులుగా చెపాల్సిన కథ. ఇందులో ప్రత్యేకంగా ఏ కమ్యూనిటీ ప్రస్తావన వుండదు. మనం అనుకున్నది సాధించాలంటే పోరాటం తప్పితే వేరే మార్గం వుండదు. అదే ఈ సినిమా కథ.

ఎప్పుడనేది చెప్పలేను కానీ అఖండ 2 ఖచ్చితంగా వుంటుంది.