బిగ్‌బాస్‌…ఆ కంటెస్టెంట్‌కు భారీ లాస్‌!

యూట్యూబ్ స్టార్ ష‌ణ్ముక్ జ‌శ్వంత్‌కు బిగ్‌బాస్ భారీ న‌ష్టాన్ని మిగ‌ల్చ‌నుందా? అంటే ఔన‌ని అత‌ని అభిమానులు చెబుతున్నారు. యూట్యూబ్‌లో భారీగా ఫాలోవ‌ర్స్ ఉన్న ష‌ణ్ముక్ బిగ్‌బాస్ రియాల్టీ షో సీజ‌న్‌-5కు వెళ్లాడు. అత‌నే విజేత‌గా…

యూట్యూబ్ స్టార్ ష‌ణ్ముక్ జ‌శ్వంత్‌కు బిగ్‌బాస్ భారీ న‌ష్టాన్ని మిగ‌ల్చ‌నుందా? అంటే ఔన‌ని అత‌ని అభిమానులు చెబుతున్నారు. యూట్యూబ్‌లో భారీగా ఫాలోవ‌ర్స్ ఉన్న ష‌ణ్ముక్ బిగ్‌బాస్ రియాల్టీ షో సీజ‌న్‌-5కు వెళ్లాడు. అత‌నే విజేత‌గా నిలుస్తాడ‌ని మొద‌ట్లో అంద‌రూ భావించారు. ఎందుకంటే అత‌నికి యూట్యూబ్‌లో ఉన్న క్రేజ్ అలాంటిది. మ‌రోవైపు ఈ ద‌ఫా బిగ్‌బాస్ రియాల్టీ షోకు ఎంపికైన కంటెస్టెంట్స్‌లో ఎవ‌రికీ ఆ స్థాయిలో ఫాలోవ‌ర్స్ లేక‌పోవ‌డం కూడా…ష‌ణ్ముక్‌కు క‌లిసొస్తుంద‌ని భావించారు.

చివ‌రికి స‌న్నీ విజేత‌గా నిలిచారు. హౌస్‌లో ష‌ణ్ముక్‌, సిరి మ‌ధ్య సాగిన ఎమోష‌న‌ల్ ట్రాక్ విక‌టించింది. వాళ్లిద్ద‌రి మ‌ధ్య  హ‌గ్గులు శ్రుతిమించాయి. చివ‌రికి సిరి త‌ల్లి హౌస్‌లోకి వెళ్లి…కూతురికి హెచ్చ‌రించినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. పైగా ఫ్రెండ్లీ హ‌గ్స్ అంటూ త‌ల్లిని కూడా సిరి, ష‌ణ్ముక్‌ ట్రోల్ చేశార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. దీంతో వాళ్లిద్ద‌రిపై బాగా వ్య‌తిరేక‌త వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో లవ్‌బ‌ర్డ్స్ ష‌ణ్ముక్ జ‌శ్వంత్‌- దీప్తి  సునైనాల మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం విడిపోయే దిశ‌గా సాగుతోంద‌నే అభిప్రాయాలున్నాయి. ఇందుకు బ‌లం క‌లిగించేలా ష‌ణ్ముక్‌, దీప్తి కామెంట్స్‌, పోస్టులు ఉన్నాయి. త‌న సెల్ నంబ‌ర్‌ను దీప్తి బ్లాక్ చేసింద‌ని ష‌ణ్ముక్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించాడు. ఇదిలా వుండ‌గా దీప్తి త‌న ఫేస్‌బుక్ ఖాతాలో ఇటీవ‌ల చేసిన ఓ పోస్ట్ వాళ్లిద్ద‌రి బంధానికి ఫుల్‌స్టాప్ పెడుతుంద‌నే వాద‌న‌ను బ‌ల‌ప‌రుస్తోంది.

Change is uncomfortable but necessary ( మారడం అసౌకర్యంగా ఉంది.. కానీ తప్పదు) అంటూ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ షేర్‌ చేసింది. ఈ పోస్ట్‌పై ఫాలోవ‌ర్స్ నుంచి దీప్తికి మ‌ద్దుతుగా కామెంట్స్ రావ‌డం గ‌మ‌నార్హం. ఇది నిజంగా మీ జీవితంలో గొప్ప నిర్ణ‌యం. ఫేక్ మ‌నుషుల‌న్ని, ఫేక్ స్నేహితుల్ని న‌మ్మొద్ద‌ని దీప్తికి సూచించారు. అత‌న్ని వ‌దిలి పెట్టాల‌ని, అతనిది మంచి వ్య‌క్తిత్వం కాదంటూ కామెంట్స్ రావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. మొత్తానికి దీప్తి నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థిస్తూ ఎక్కువ మంది కామెంట్స్ చేయ‌డం క‌నిపిస్తుంది.

బిగ్‌బాస్ విజేత‌గా మ‌రింత పాపులారిటీని సంపాదించుకోవాల‌ని వెళ్లిన ష‌ణ్ముక్‌…ఆ హౌస్ చేసిన మాయ‌తో చివ‌రికి ప్రేమికురాల‌ని కోల్పోవాల్సి వ‌స్తోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌స్తుత ప‌రిణామాలు ష‌ణ్ముక్‌కు భారీ లాస్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదిలా వుండ‌గా అత‌నితో విడిపోవాల‌నే త‌న నిర్ణ‌యం స‌రైందా, కాదా తెలుసుకునేందుకు ఈ పోస్టు పెట్టిన‌ట్టు నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏది ఏమైనా సెల‌బ్రిటీ యూట్యూబ్ ప్రేమ జంట బ్రేక‌ప్ దిశ‌గా అడుగులేస్తోంద‌నే చ‌ర్చ సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోంది.