హీరోయిన్ల తొలి ప్రాధాన్యం ఎప్పుడూ బాలీవుడ్డే. మరీ ముఖ్యంగా ఉత్తరాది హీరోయిన్లైతే ఎప్పుడు అవకాశం వస్తే, బాలీవుడ్ కు ఎగిరిపోదామా అని చూస్తుంటారు. అలాంటి అవకాశమే కియరా అద్వానీకి వచ్చింది. ఇప్పుడు ఏకంగా అక్కడ సెటిలైపోయింది. అర్జున్ రెడ్డితో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ లో మరో హిట్ కొట్టింది.
అక్షయ్ కుమార్, కరీనాకపూర్ తో కలిసి కియరా చేసిన గుడ్ న్యూజ్ అనే సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్టయింది. ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా నిన్నటి వసూళ్లతో కలుపుకొని 147 కోట్ల రూపాయల నెట్ కలెక్ట్ చేసింది. ఇవాళ్టి వసూళ్లతో 150 కోట్ల రూపాయల క్లబ్ లో చేరిపోవడం ఖాయం.
మరో 5 రోజుల వరకు ఈ సినిమా హవా కొనసాగనుంది. ఆ తర్వాత దీపికా పదుకోన్, అజయ్ దేవగన్ సినిమాలు రిలీజ్ అవుతాయి. సో.. మరికొన్ని రోజుల్లో ఇది 200 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలున్నాయని అంచనా వేస్తోంది ట్రేడ్. అదే కనుక జరిగితే ఈ లస్ట్ స్టోరీస్ బ్యూటీ, బాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ అనిపించుకుంటుంది.
ఈ సినిమా విడుదలకు ముందే 4 సినిమాలకు కాల్షీట్లు ఇచ్చింది కియరా. ఇప్పుడీ సినిమా కూడా హిట్ అవ్వడంతో, ఆమెకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. అదే కనుక జరిగితే టాలీవుడ్ ప్రేక్షకులు ఈ పిల్లను మరిచిపోవాల్సిందే.
సమస్య సాల్వ్ అయింది..ఇద్దరు హీరోలని కన్విన్స్ చేసాం