ప్రభాస్ ఇమేజ్ కంటే పెద్ద సినిమా ఇది!

ప్రభాస్ పాన్-ఇండియా హీరో. అతడి ఇమేజ్ ఇప్పటికే ఆకాశాన్నంటింది. అయితే ప్రభాస్ కున్న ఇమేజ్ కంటే రాధేశ్యామ్ సినిమా పెద్దదంటున్నాడు దర్శకుడు రాధాకృష్ణ. చాలా పెద్ద స్పాన్ ఉన్న కథలోకి ప్రభాస్ లాంటి హీరో…

ప్రభాస్ పాన్-ఇండియా హీరో. అతడి ఇమేజ్ ఇప్పటికే ఆకాశాన్నంటింది. అయితే ప్రభాస్ కున్న ఇమేజ్ కంటే రాధేశ్యామ్ సినిమా పెద్దదంటున్నాడు దర్శకుడు రాధాకృష్ణ. చాలా పెద్ద స్పాన్ ఉన్న కథలోకి ప్రభాస్ లాంటి హీరో రావడం తన అదృష్టం అంటున్నాడు.

“ప్రభాస్ ను దృష్టిలో పెట్టుకొని ఈ కథ రాయలేదు. 18 ఏళ్ల కిందట వచ్చిన ఐడియా ఇది. ప్రభాస్ ఈ ప్రాజెక్టులోకి రావడం మా అదృష్టం. ఆయన రాకతో మా సినిమా పరిథి పెరిగింది. కానీ ఒకటి మాత్రం చెప్పగలను. ఇది ప్రభాస్ ఇమేజ్ కంటే పెద్ద సినిమా. ఆ మాటకొస్తే.. ఏ హీరో ఇమేజ్ తో చూసుకున్నా ఇది పెద్ద కథే అవుతుంది.”

రాధేశ్యామ్ సినిమాను క్లాస్ మూవీ అంటే ఒప్పకోవడం లేదు ఈ దర్శకుడు. ఇది అందరికీ కనెక్ట్ అవుతుందని చెబుతున్నాడు. ప్రతి మనిషికి కొన్ని నమ్మకాలుంటాయని, అలా నమ్మే ప్రతి వ్యక్తికి ఈ సినిమా నచ్చుతుందని అంటున్నాడు.

“ఇది కేవలం క్లాస్ మూవీ మాత్రమే కాదు. ఇది అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇది అందరి స్టోరీ. మనకి, మన నమ్మకానికి మధ్య జరిగే ఫైట్ ఈ సినిమా స్టోరీ. 10 ఏళ్ల కుర్రాడి నుంచి 70 ఏళ్ల వృద్ధుడి వరకు అందరికీ కనెక్ట్ అవుతుంది. ప్రేమ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది. మాస్-క్లాస్ అనే తేడా లేదు.”

ప్రభాస్-పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన రాధేశ్యామ్ సినిమా ట్రయిలర్ తాజాగా రిలీజైంది. విడుదలైన 24 గంటల్లోనే 64 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించింది. జనవరి 14న సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది రాధేశ్యామ్ మూవీ.