అభిమానులతో ఫొటో షూట్ పెట్టి సరిలేరు నీకెవ్వరు యూనిట్ విమర్శల పాలైన సంగతి తెలిసిందే. మొదటి రోజు కార్యక్రమంలో తొక్కిసలాట జరగడమే దీనికి కారణం. ఈ ఘటనపై నిర్మాత అనీల్ సుంకర స్పందించాడు. తొక్కిసలాట జరిగడం వాస్తవమనే విషయాన్ని అంగీకరించిన అనీల్ సుంకర్.. ఓవరాల్ గా అంతా సజావుగా సాగిందంటున్నాడు.
“25, 26 తేదీల్లో ఫొటోషూట్ అనుకున్నాం. 25న చిన్న తొక్కిసలాట జరిగింది. 26న అనుకున్న దానికంటే రెట్టింపు సంఖ్యలో అభిమానులు వచ్చారు. అంతా సజావుగా జరిగింది. కొన్ని కొన్ని ఘటనలు మనం ఊహించలేం. ఇది కూడా అలాంటిదే. 2500 మంది కోసం మేం ఏర్పాట్లు చేసుకున్నాం. దానికి తగ్గట్టుగానే సెక్యూరిటీ కూడా పెట్టుకున్నాం. మొత్తం పోలీసుల ఆధ్వర్యంలోనే జరిగింది.”
పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఫొటోషూట్ పెట్టామనే వార్తను ఈ విధంగా ఖండించాడు అనీల్ సుంకర. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా గురించి మాట్లాడుతూ.. ఎవ్వరూ ఊహించని విధంగా ఆ సినిమా ఉంటుందని స్పష్టంచేశాడు.
“సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి ప్రేక్షకులు ఏం అనుకుంటారో దానికి కంప్లీట్ గా యూ-టర్న్ లాంటి సినిమా ఇది. ఆర్మీ మేజర్ బోర్డర్ నుంచి ఇక్కడికొస్తాడు, అతడి ఆగ్రహం, వచ్చి ఏదో సరిచేసి వెళ్లిపోతాడు లాంటివి మనం చూశాం. ఇది మాత్రం అలా ఉండదు. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ స్టోరీ ఉంటుంది. ఓ ఆర్మీ మేజర్ బోర్డర్ నుంచి ఇక్కడికి వచ్చాడనేది ఎవరైనా ఊహిస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడే చేశాడనేది ఎవ్వరూ ఊహించలేరు.”
మహేశ్ హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయింది. సినిమా మొత్తం చూసిన అనీల్ సుంకర్ చాలా బాగా వచ్చిందంటున్నాడు, మరో 2 రోజుల్లో సినిమాను సెన్సార్ కు పంపిస్తామని ప్రకటించాడు.