ఈ ఉత్త‌ర్వులు కూడా జ‌గ‌న్‌కు షాకే!

నిన్న హైకోర్టు ఓ కేసు విష‌య‌మై ఉత్త‌ర్వులిచ్చింది. స‌హ‌జంగా ఆంధ్ర‌జ్యోతి అత్యుత్సాహం అంద‌రికీ తెలిసిందే క‌దా. హైకోర్టు ఆదేశాల‌ను త‌న‌కు అనుకూలంగా చ‌క్క‌గా వండి వార్చింది. అదెలాగంటే రాష్ట్ర సెక్యూరిటీ క‌మిష‌న్ ఎస్ఎస్‌సీ) లో…

నిన్న హైకోర్టు ఓ కేసు విష‌య‌మై ఉత్త‌ర్వులిచ్చింది. స‌హ‌జంగా ఆంధ్ర‌జ్యోతి అత్యుత్సాహం అంద‌రికీ తెలిసిందే క‌దా. హైకోర్టు ఆదేశాల‌ను త‌న‌కు అనుకూలంగా చ‌క్క‌గా వండి వార్చింది. అదెలాగంటే రాష్ట్ర సెక్యూరిటీ క‌మిష‌న్ ఎస్ఎస్‌సీ) లో ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబునాయుడి పేరు రాయాల‌ని హైకోర్టు ఆదేశించార‌నేది ఆ వార్త సారాంశం. ఓహో జ‌గ‌న్‌కు హైకోర్టు మ‌రో షాక్ ఇచ్చింద‌న్న మాట అని ఆ వార్త చ‌దివిన క్ష‌ణంలో ఎవ‌రికైనా క‌లిగే భావ‌న‌.

అయితే ఆ మ‌రుస‌టి రోజు, అంటే నేడు మిగిలిన ప‌త్రిక‌ల్లో స‌ద‌రు హైకోర్టు తీర్పు లేదా ఆదేశాల‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలిసిన త‌ర్వాత అస‌లు నిజాలేంటో బ‌య‌ట‌ప‌డ్డాయి. అంత‌కు ముందు రోజు ఆంధ్ర‌జ్యోతిలో హైకోర్టు ఆదేశాల‌కు సంబంధించిన వార్త గుర్తుకొచ్చి …ఔరా, తిమ్మిని బ‌మ్మి; బ‌మ్మిని తిమ్మి చేయ‌గ‌ల‌రంటే ఏమో అనుకున్నాం గానీ, ఆ ప‌ని చేయ‌గ‌ల స‌మ‌ర్థ‌త ఒక్క ఆ ప‌త్రిక‌కే ఉంద‌నే అభిప్రాయం మ‌రోసారి రుజువైంది.

అస‌లు ఆ కేసు వివ‌రాలేంటో తెలుసుకుందాం.

ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర భద్రత కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రకాశ్‌సింగ్‌ వర్సెస్‌ అదర్స్‌ కేసులో సుప్రీంకోర్టు 2006లో తీర్పు చెప్పింది. ఈ కమిషన్‌లో ప్రతిపక్ష నేతకు సైతం స్థానం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 

ఈ తీర్పు నేప‌థ్యంలో   2013లో రాష్ట్ర భద్రత కమిషన్‌ను ఏర్పాటు చేశారు. హోంశాఖ మంత్రి ఎక్స్‌ అఫిషియో చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ప్రతిపక్ష నేత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ప్రభుత్వం నామినేట్‌ చేసిన ఐదుగురు స్వతంత్ర సభ్యులు ఉంటారు.

2014లో చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చారు. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర భద్రత కమిషన్‌లో ప్రతిపక్ష నేతకు ఉన్న స్థానాన్ని తొలగిస్తూ  చంద్రబాబు ప్రభుత్వం 2018,ఏప్రిల్ 9న జారీచేసిన జీవో 42 జారీ చేసింది. అధికారం పోయిన వెంట‌నే చంద్ర‌బాబుకు హ‌క్కులు గుర్తుకొచ్చాయి. దీన్ని సవాల్‌ చేస్తూ న్యాయవాది తాండవ యోగేష్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశాడు.

ఈ వ్యాజ్యంపై  పలుమార్లు విచారించిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది.  వాదనలు విన్న ధర్మాసనం సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించింది. రాష్ట్ర భద్రత కమిషన్‌లో ప్రతిపక్ష నేతకు స్థానం కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది. 

గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 42ను సవరించి, తాజాగా జీవో జారీ చేసేందుకు ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు నిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలితల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. కాగా జ‌గ‌న్ పాల‌న‌లో హైకోర్టులో పిల్ వేయ‌డం, ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా తీర్పు రావ‌డంతో జ‌గ‌న్ స‌ర్కార్‌కు షాక్ త‌గిలిన‌ట్టు ఎల్లో మీడియా వార్త‌లివ్వ‌డం గమ‌నార్హం.

ఇంకెన్ని రహస్య జీవోలు, వ్యవహారాలున్నాయో