మిస్ యూనివ‌ర్స్ కు ద‌క్కేదెంత‌..?!

ప్ర‌తియేటా అందాల పోటీలు జ‌రుగుతూ ఉంటాయి. వాటిల్లో మిస్ యూనివ‌ర్స్, మిస్ వ‌రల్డ్ వంటి కీర్తి కిరీటాల‌కు య‌మ క్రేజ్. ఏ దేశానికి చెందిన యువ‌తులు ఈ టైటిళ్ల‌ను గెలిచినా, ఆదేశాల పేర్లు కూడా…

ప్ర‌తియేటా అందాల పోటీలు జ‌రుగుతూ ఉంటాయి. వాటిల్లో మిస్ యూనివ‌ర్స్, మిస్ వ‌రల్డ్ వంటి కీర్తి కిరీటాల‌కు య‌మ క్రేజ్. ఏ దేశానికి చెందిన యువ‌తులు ఈ టైటిళ్ల‌ను గెలిచినా, ఆదేశాల పేర్లు కూడా మార్మోగుతూ ఉంటాయి. ఇటీవ‌లే జ‌రిగిన మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో భార‌తీయ యువ‌తి హ‌ర్నాజ్ సాంధూ టైటిల్ విజేత‌గా నిలిచింది. మ‌రి మిస్ యూనివ‌ర్స్ అనే బిరుదుతో పాటు.. ఆమెకు ద‌క్కే సౌల‌భ్యాలేమిటి? అనే అంశం గురించి ప‌రిశీలిస్తే.. ఆస‌క్తిదాయ‌క‌మైన విష‌యాలున్నాయి.

అత్యంత ఖ‌రీదైన కిరీట ధార‌ణ అవ‌కాశం. ఇది మిస్ యూనివ‌ర్స్ కు ముందుకు ద‌క్కే గౌర‌వం. మిస్ యూనివ‌ర్స్ గా ఎంపికైన యువ‌తికి, గ‌త ఏడాది చాంఫియ‌న్ త‌న నెత్తి మీదున్న కిరీటాన్ని తీసి ఈమె కు తొడగ‌డాన్ని అంతా గ‌మ‌నిస్తూ ఉంటారు. మ‌రి ఆ కిరీటం విలువ ఎంత అంటే.. ఏకంగా 37 కోట్ల రూపాయ‌ల‌ట‌! ప్ర‌పంచంలోనే అత్యంత విలువైన కిరీటంగా దీనికి పేరుంది. అంత విలువైన కిరీటాన్ని స‌గౌర‌వంగా ధ‌రించ‌డం మిస్ యూనివ‌ర్స్ కు గొప్ప అవ‌కాశం. ఒక ఏడాది పాటు దాన్ని ఆమె ధ‌రించ‌వ‌చ్చు. త‌దుప‌రి ఏడాది కొత్త మిస్ యూనివ‌ర్స్ కు దాన్ని స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

ఇక ప్రైజ్ మ‌నీ విష‌యానికి వ‌స్తే దాదాపు కోటిన్న‌ర పైనే అని తెలుస్తోంది. ఇది అధికారిక ధ్రువీక‌ర‌ణ కాక‌పోయినా.. కోటిన్న‌ర రూపాయ‌ల పై మొత్తం మిస్ యూనివ‌ర్స్ టైటిల్ విన్న‌ర్ కు ద‌క్కుతుంది. అలాగే న్యూయార్క్ న‌గ‌రంలో ఒక బిగ్ ఫ్లాట్ కీస్ కూడా ఆమె చేతికి అందుతాయి. కేవ‌లం ఏడాదే కాదు.. వీలైనన్ని రోజులు, ఉండాల‌నుకున్న‌న్ని రోజులు.. ఆమె ఆ ఫ్లాట్ లో ఉండ‌వ‌చ్చ‌ట‌. అక్క‌డ ఉన్న‌న్ని రోజులూ.. ఆమెకు అన్నీ ఉచితంగానే ద‌క్కుతాయ‌ని తెలుస్తోంది. ఆమె కాస్మోటిక్స్, తిండి, క్లోతింగ్, ఇలా స‌ర్వం ఉచితంగానే ల‌భిస్తాయ‌ట అక్క‌డ‌. అలాంటి ల‌గ్జ‌రీయ‌స్ ఫ్లాట్ లో నివ‌సించ‌వ‌చ్చు.

ఇక ఏడాది పాటు.. ఆమె అందాన్ని, ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షించేందుకు ఒక టీమ్ వెంటే ఉంటుంది. మేక‌ప్ ఆర్టిస్టుల‌తో మొద‌లుకుని, న్యూట్రిషియ‌నిస్ట్.. ఇలాంటి వాళ్లంతా ఒక టీమ్ గా ఆమె వెంట ఉంటుంది. ఏడాది పాటు మిస్ యూనివ‌ర్స్ ఎక్క‌డికి వెళ్లాల‌న్నా.. విమానం టికెట్లు, ఆహారం ఇవ‌న్నీ ఫ్రీ. ఈ బాధ్య‌త‌ల‌న్నింటినీ మిస్ యూనివ‌ర్స్ గా ఎంపిక చేసిన వాళ్లే చూసుకుంటారు. ఆమెకు ప్ర‌పంచ వ్యాప్తంగా వచ్చే ఆహ్వానాల్లో ఎక్క‌డ‌కు వెళ్లాల‌న్నా.. ఏర్పాట్ల‌న్నీ చ‌క‌చ‌కా జ‌రిగిపోతాయి.

ఇక మిస్ యూనివ‌ర్స్ ఆర్గ‌నైజేష‌న్ కు ఆమె అంబాసిడ‌ర్ గా చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా చారిటీ కార్య‌క్ర‌మాల‌కూ, ఇత‌ర ఈవెంట్ల‌న్నింటికీ మాత్రం హాజ‌రు కావాల్సి ఉంటుంది. బాధ్య‌త‌గా తీసుకుని ఈ ప‌ని చేయాల్సి ఉండొచ్చు.

ఇక ఇండియాలో అయితే మిస్ యూనివ‌ర్స్, మిస్ వ‌ర‌ల్డ్ ల‌కు సినీ అవ‌కాశాలు సుసాధ్యం. ఇలా స‌క్సెస్ అయిన సుస్మితా సేన్, ఐశ్వ‌ర్య‌రాయ్ , లారా ద‌త్తా లాంటి వాళ్లు ప్ర‌ముఖ ఉదాహ‌ర‌ణ‌లు. సినిమాల్లోకి ఎంట్రీకి అందాల పోటీల్లో విజ‌యం గొప్ప అవ‌కాశం. ఇవ‌న్నీ గాక‌.. ఒక‌సారి మిస్ యూనివ‌ర్స్ అనే ఖ్యాతి జీవితాంతం ఉంటుంది. ఇది సామాజిక గౌర‌వాన్ని అందిస్తుంద‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు.