సలార్ నిర్మాతలు చేస్తున్న తకరారు ఇంతా అంతా కాదు. ప్రభాస్ నటించిన సలార్ సినిమా నిర్మాతల పుణ్యమా అని తెలుగు సినిమాల నిర్మాతలు గింగిరాలు తిరుగుతున్నారు.
తాము చేసుకున్న విడుదల ప్లాన్ లు అన్నీ కకావికలు అయిపోతున్నాయి. పైగా సలార్ సినిమా నిర్మాతలు అయిన హంబోలే ఫిలింస్ ఏదీ ముందుగా చెప్పడం లేదు. ఆ మాటకు వస్తే అస్సలు చెప్పడమే లేదు. సెప్టెంబర్ 28 నుంచి వాయిదా అన్న సంగతి కూడా ముందుగా చెప్పలేదు. దాంతో మన సినిమాలు అన్నీ కిందా మీదా అయిపోయి మంచి డేట్ లు వదిలేసాయి. అన్ని సినిమాలు సెప్టెంబర్ 28, అక్టోబర్ 6 కు పోగు పడిపోయాయి.
ఇప్పుడు కొత్తగా సలార్ డిసెంబర్ 22 అనే గ్యాసిప్ లు మొదలయ్యాయి. ఇది కూడా అధికారికంగా ప్రకటించలేదు. దాంతో అక్కడ ప్లాన్ చేసుకున్న మన మూడు సినిమాలు తలలు పెట్టుకుంటున్నాయి.
నితిన్ తన సినిమా ఎక్స్ ట్రా ఆర్టినరీ మాన్ డిసెంబర్ 9 కి జరపాలనుకుంటున్నారు.
వెంకీ తన సైంధవ్ సినిమాను సంక్రాంతి బరిలో దింపితే ఎలా వుంటుందా అని చూస్తున్నారు.
నాని తన హాయ్ నాన్న సినిమాను డిసెంబర్ 7 కు ప్లాన్ చేస్తే బెటర్ అనుకుంటున్నారు.
ఇప్పటికే సంక్రాంతి కిక్కిరిసిపోయి వుంది. గుంటూరు కారం, హనుమాన్, ఫ్యామిలీ స్టార్, ఈగిల్ వుండనే వున్నాయి.
ఇలా మొత్తం మీద మన సినిమాలు అన్నీ కిందా మీదా అయిపోతున్నాయి. సలార్ కు రెండు వారాలు ముందు, రెండు వారాలు వెనుక వదిలేయాల్సి వస్తోంది. దీంతో మన సినిమాలు అన్నీ కిందా మీదా అవుతూ సరైన కలెక్షన్లు పోగొట్టుకోవాల్సి వస్తోంది.