నేను పాన్ ఇండియా హీరోని కాదు, సౌత్ హీరోని!

తననుతాను సౌత్ హీరోగా ప్రకటించుకున్నాడు హీరో నాని. ఈగ సినిమాతో తను సౌత్ మొత్తం పాపులర్ అయ్యానని, శ్యామ్ సింగరాయ్ తో మరోసారి అలాంటి పాపులారిటీ వస్తుందని చెప్పుకొచ్చాడు. గతంలో ఓసారి పాన్ ఇండియా…

తననుతాను సౌత్ హీరోగా ప్రకటించుకున్నాడు హీరో నాని. ఈగ సినిమాతో తను సౌత్ మొత్తం పాపులర్ అయ్యానని, శ్యామ్ సింగరాయ్ తో మరోసారి అలాంటి పాపులారిటీ వస్తుందని చెప్పుకొచ్చాడు. గతంలో ఓసారి పాన్ ఇండియా హీరో అనిపించుకునే అవకాశం వచ్చినప్పటికీ మిస్ అయినట్టు వెల్లడించాడు.

“ఈగ సినిమాతో సౌత్ అంతా కూడా బాగా పాపులర్ అయ్యాను. నాని అంటే మా హీరో అన్నంతగా మారిపోయాను. చెన్నై, బెంగళూరు వంటి చోట్లకు వెళ్తే జనాలు ఎంతో ప్రేమ చూపిస్తుంటారు. నా తదుపరి చిత్రాలు దక్షిణాది భాషల్లో రిలీజ్ చేస్తాం. హిందీకి సరిపడా కథ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. జెర్సీ సినిమా పాన్ ఇండియాగా చేయాల్సింది. కానీ అప్పుడు ఆ ఆలోచన రాలేదు. నేను చేయలేదు కాబట్టి షాహిద్ కపూర్ చేస్తున్నారు.”

ఇకపై సౌత్ మొత్తం కనెక్ట్ అయ్యే కథలు చేస్తానంటున్నాడు నాని. త్వరలోనే రాబోతున్న 'అంటే సుందరానికి', 'దసరా' సినిమాలు రెండూ సౌత్ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతాయంటున్నాడు. ఓ సినిమాకు పాన్-ఇండియా అప్పీల్ కేవలం కథ వల్ల మాత్రమే వస్తుందంటున్నాడు నాని.

“టక్ జగదీష్ సినిమాను ఎక్కడా రిలీజ్ చేయలేం. ఎందుకంటే అది మన తెలుగు నేటివిటీని చూపించే సినిమా. అది పూర్తిగా తెలుగు వాళ్ల సినిమా. ఈ కాలం కంటెంట్ ఉన్న వాళ్లే స్ట్రాంగ్. కథను పాన్ ఇండియన్ చేయాల్సిన పని లేదు. కథే పాన్ ఇండియన్ అప్పీల్ తీసుకొస్తుంది. మనం కష్టపడి దాన్ని పాన్ ఇండియాగా చేయాల్సిన పని లేదు.”

తను నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా కథకు పాన్ ఇండియా అప్పీల్ ఉందంటున్నాడు నాని. అయితే సినిమాను సౌత్ లాంగ్వేజెస్ లో మాత్రమే ఒకేసారి రిలీజ్ చేస్తున్నామని తెలిపాడు. సినిమాలో 4 ఎపిసోడ్స్ ఉంటాయని, అవి వచ్చినప్పుడు మాత్రం గూస్ బంప్స్ మూమెంట్స్ అవుతాయని అంటున్నాడు.