రాజ‌ధానిపై టీడీపీ గ‌ద్ద‌లు

రాజ‌ధానిపై టీడీపీ గ‌ద్ద‌లు తిరుగుతున్నాయి. పిల్ల‌ల కోడి  త‌న రెక్క‌ల కింద పిల్ల‌ల‌ను జాగ్ర‌త్త‌గా దాచుకుంటున్న‌ట్టు, భూమాత త‌న రెక్క‌ల కింద టీడీపీ గ‌ద్ద‌ల నుంచి కాపాడుకునేందుకు రాజ‌ధాని భూమిని దాచుకుంది. Advertisement ఏఏ…

రాజ‌ధానిపై టీడీపీ గ‌ద్ద‌లు తిరుగుతున్నాయి. పిల్ల‌ల కోడి  త‌న రెక్క‌ల కింద పిల్ల‌ల‌ను జాగ్ర‌త్త‌గా దాచుకుంటున్న‌ట్టు, భూమాత త‌న రెక్క‌ల కింద టీడీపీ గ‌ద్ద‌ల నుంచి కాపాడుకునేందుకు రాజ‌ధాని భూమిని దాచుకుంది.

ఏఏ టీడీపీ గ‌ద్ద ఎంతంత భూమిని త‌న క‌బంధ హ‌స్తాల్లో దాచుకుందో లెక్క‌లు తేలాయి. టీడీపీ గ‌ద్ద‌లు 4,069.94 ఎకరాల భూమిని కాజేశాయ‌నే వాస్త‌వాలు వెల్ల‌డ‌య్యాయి.  జూన్‌ 1, 2014 – డిసెంబర్‌31, 2014 మధ్యకాలంలో బినామీల పేరిట ఆ భూములను దోచేశారని జ‌గ‌న్ స‌ర్కార్ నియ‌మించిన క‌మిటీ త‌న నివేదికలో స్పష్టం చేసింది.

చంద్ర‌బాబు పాల‌న‌లో  రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో య‌థేచ్ఛ‌గా సాగిన  భూఅక్రమాలపై విచారణకు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, అనిల్‌కుమార్‌ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డిల నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన సంగతి తెలిసిందే. రాజధాని భూదోపిడీపై ఉపసంఘం విచారణ చేసి సీఎం జ‌గ‌న్‌కు శుక్రవారం నివేదిక అందచేసింది.

అప్పటి సీఎం చంద్రబాబు, ఆయన ఎల్లో బ్యాచ్  పెద్ద ఎత్తున ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడిందని, రాజధాని ప్రకటన సమాచారం ముందే తెలుసుకుని భూములు కొనుగోలు చేసి అక్రమాలకు బ‌రితెగించారని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం తేల్చింది.

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడిన వారిలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌ సన్నిహితులున్నార‌ని తేలింది. కంచే చేను మేసిన చందంగా రాజ‌ధానిలో భూముల కొనుగోలు వ్య‌వ‌హారం త‌యారైంది.  అసైన్డ్, లంక భూముల్లోనూ భారీగా అక్రమాలకు పాల్పడ్డారని, త‌మ వారి కోసం రాజధాని సరిహద్దులను మార్చి లాభం పొందార‌ని  ఉపసంఘం నిర్ధారించింది.  

లింగ‌మ‌నేని ర‌మేష్ కుటుంబం,  మాజీ మంత్రి నారాయణ, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు , టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ,  నారా లోకేష్ సన్నిహితుడు వేమూరు రవికుమార్‌ ప్రసాద్ , మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు  త‌దిత‌ర టీడీపీ నేత‌లు బినామీల పేర్ల‌తో య‌థేచ్ఛ‌గా భూములు కొన్నార‌ని నిర్ధార‌ణైంది.

 రాజధాని ప్రాంతంలో 2353.28 ఎకరాల అసైన్డు, లంక భూములను విడిచిపెట్ట‌లేదు. 1954కు ముందు, ఆ త‌ర్వాత ఈ భూముల‌ను మాజీ సైనికులు, రాజకీయ బాధితుల‌కు అసైన్డ్‌ చేశారు. వీరితో పాటు ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్‌ భూము లున్నాయి.

అసైన్డు, లంక భూములు కొనుగోలు చేసిన చంద్రబాబు అండ్‌ కో ల్యాండ్‌ పూలింగ్‌ కింద వాటిని ఇచ్చినట్లు గుర్తించారు. రాజధాని ప్రాంతంలో 850 ఎకరాల భూములను  ధారాదత్తం చేసినట్లు ఉప‌సంఘం గుర్తించింది. పేర్ని నాని చెప్పిన‌ట్టు టీడీపీ గ‌ద్ద‌లు కోరుతున్న‌ట్టు న్యాయ‌విచార‌ణ‌కు సిద్ధం కావాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.