ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఈ రోజు ఎంతో ప్రత్యేకమైంది. ఇవాళ ఆయన పుట్టిన రోజు. వైసీపీకి పండుగ రోజు.
ప్రధాని మోడీ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. మెగాస్టార్ చిరంజీవి, ప్రిన్స్ మహేశ్‌బాబు తదితరులు జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక సొంత పార్టీకి చెందిన ప్రముఖులు, ఉన్నతాధికారులు, పార్టీ శ్రేణుల శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మర్యాదపూర్వకంగా జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సహజంగా రాజకీయాలకు అతీతంగా అందరికీ చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతుంటారు. జగన్ విషయానికి వస్తే…ఈ దఫా మధ్యాహ్నం తర్వాత 3.02 గంటలకు జగన్‌కు Happy Birthday అంటూ ట్వీట్ చేయడం విశేషం.
జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు చంద్రబాబు ఎంతో ఆలోచించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆయన ట్వీట్ చేసిన సమయాన్ని పరిశీలిస్తే దాదాపు సాయంత్రం వరకూ ఆలోచించారని అర్థమవుతోంది. బాబు ట్వీట్‌కు వచ్చిన కామెంట్స్ చూస్తే…మీరు ఇంకా మారలేదంటూ ప్రత్యక్షమయ్యాయి.