ఏం కథ రాసుకున్నావ్ శౌర్య!

ఛలో, అమ్మమ్మగారిల్లు, నర్తనశాల.. ఇంకాస్త వెనక్కి వెళ్తే జ్యో అచ్యుతానంద, ఒక మనసు, కల్యాణ వైభోగమే. ఇలా ఉంది నాగశౌర్య ఫిల్మోగ్రఫీ. సో ఇతడ్నుంచి రాబోయే సినిమా కూడా ఇలానే సున్నితమైన ప్రేమభావాలతో లేదంటే…

ఛలో, అమ్మమ్మగారిల్లు, నర్తనశాల.. ఇంకాస్త వెనక్కి వెళ్తే జ్యో అచ్యుతానంద, ఒక మనసు, కల్యాణ వైభోగమే. ఇలా ఉంది నాగశౌర్య ఫిల్మోగ్రఫీ. సో ఇతడ్నుంచి రాబోయే సినిమా కూడా ఇలానే సున్నితమైన ప్రేమభావాలతో లేదంటే ఓ మంచి కామెడీతో వస్తుందని అంతా అనుకుంటారు. కానీ అశ్వథ్థామ టీజర్ అందరికీ జాయింట్ గా ఓ చిన్నపాటి షాకిచ్చింది.

టీజర్ ప్రారంభంలోనే కేజీఎఫ్ హీరోకు ఇచ్చినంత ఎలివేషన్ ఇచ్చారు. “గమ్యం తెలియని యుద్ధాన్ని గెలవాలంటే ఆరున్నర అడుగుల నారాయణాస్త్రం కావాలి, ఒక అశ్వథ్థాముడు రావాలి” అనే డైలాగ్ తోనే ఇది పక్కా యాక్షన్ మూవీ అనే విషయం అర్థమైపోతోంది. దానికి తగ్గట్టుగానే టీజర్ లో కేవలం యాక్షన్ ఎలిమెంట్స్ చూపించారు.

ఈ సినిమా కథ నాగశౌర్యదే. అందుకే అతడు తన ఛాతిపై సినిమా టైటిల్ ను పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నాడు. కాకపోతే తన గత సినిమాల టైపులో ఎంటర్ టైన్ మెంట్, కామెడీ మిక్స్ చేస్తూ కథ రాసుకొని ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ శౌర్య మాత్రం యాక్షన్ స్టోరీ రాశాడనే విషయం టీజర్ చూస్తే అర్థమౌతుంది. కంటికి కనిపించని శత్రువును అశ్వథ్థామలా నాగశౌర్య ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశాన్ని మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో విశాఖ కేంద్రంగా చెప్పినట్టుంది.

కథ సంగతి పక్కనపెడితే.. టెక్నికల్ గా టీజర్ బాగుంది. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ టీజర్ లో మేజర్ హైలెట్స్. అన్బు-అరివు కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకు హైలెట్ అని యూనిట్ పదేపదే చెబుతోంది. అందుకు తగ్గట్టుగానే టీజర్ లో వాటికే చోటిచ్చారు. అన్నట్టు ఈ టీజర్ ను సమంత రిలీజ్ చేసింది.

నా సినిమా కు నేనే కధ రాసుకున్నా