ఇది మేం పెట్టిన హెడ్డింగ్ కాదు. కింద రాసిన మేటర్ తో కూడా మాకు ఎలాంటి సంబంధం లేదు. చిన్న చిన్న అక్షరదోషాలు మాత్రమే సవరించాం. ప్రస్తుతం వాట్సాప్ లో వైరల్ గా మారుతున్న ఈ చిన్న సమాచారాన్ని మా పాఠకులకు అందించడం కోసం మాత్రమే ఈ ప్రయత్నం.
20 లక్షలు కూడా చెయ్యని పొలం ప్రకటన రాగానే కోటిన్నర అని త్యాగం చేశారు. కొందరు కొద్దిగా అదృష్టం ఉన్న వారు.. ఆమ్ముకున్నారు. బాగా అదృష్టం ఉన్న వారు శంకుస్థాపన సమయంలో రెండున్నర కోట్లకి అమ్ముకున్నారు. అసలు అదృష్టవంతులని బెదిరించి అసైన్డ్ భూములు అని రాయించుకున్నారు పదో పరకో చేతిలో పెట్టారు. దురాశకి పోయి 10 కోట్లకి అమ్ముకుందాం అనుకున్న వారు మునిగిపోయారు. వీరే ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చారు. వీరి వెనుక ఉన్నవారు అప్పులు చేసి ఉన్న డబ్బుతో పులి ని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు హైటెక్ సిటీ లో సంపాదించిన వారి లాగా తెల్లారేపాటికి కోటీశ్వరులం అవ్వుదాము అని కొన్నారు..
ఇప్పుడు వీరి ముఖ చిత్రం ఏమిటి అనేది ఒకసారి ఆలోచిద్దాం…
కొద్దిగా అదృష్టం ఉన్నవారు అప్పుడు వచ్చిన కొద్ది డబ్బుతో కొద్దిగా దూరంలో పొలం కొనుక్కున్నారు. బాగా అదృష్టం ఉన్న వారు పొలంతో పాటు Benz, Audi cars కొనుక్కున్నారు. అసలు అదృష్టవంతులకి పొలం వెనక్కి వచ్చింది అప్పుడు అమ్ముకున్న డబ్బు వారి వద్దే ఉంది. ఎవరైతే చంద్రబాబు మీద అతిగా ఆశలు పెట్టుకున్నారో వారే మునిగిపోయారు.
ఎంత మునిగారు అనేది ఒక చిన్న లెక్క…
2015 లో 2 కోట్లకి కొన్నారు అనుకుందాం..నెలకి వడ్డీ బెజవాడ కాల్ మనీ లాగా కాకుండా ధర్మం అయిన రాయలసీమ వడ్డీ (రాయలసీమ ధర్మవరం & ప్రొద్దుటూరులలో కేవలం నమ్మకం మీద ఈ రోజుకు కూడా 100 కి నెలకి 1.25 పైసల నుండి 3 రూపాయల వరకు నడుస్తుంది) అంటే నెలకి రెండున్నర లక్షల వడ్డీ. ఈ అరవై నెలలకి బారు వడ్డీ వేసుకున్నా అది కోటిన్నర వరకు అవుతుంది. మొత్తం కలిపి 4 కోట్లు. ఇప్పుడు రేటు ఎంత ఉంది. ఎంతకి అమ్మితే ఎంత మిగులుతుంది అనే ఏడుపే తప్ప రాష్ట్రం మీద కానే కాదు.
డెవలప్మెంట్ & ఉద్యోగాలు కేవలం రాజధాని లో కాకుండా బయట కూడా వస్తాయి. ఈ కొద్ది మంది కోసం లక్ష కోట్ల అప్పు మా నెత్తిన వేయొద్దు మహా ప్రభో అని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.