మెగా హీరో సరసన మిస్ వరల్డ్

మానుషి చిల్లర్.. మొత్తానికి అనుకున్నది సాధించింది. సినిమాల్లోకి ఇలా వచ్చిందో లేదో అలా రామ్ చరణ్ ను పొగడ్డం మొదలుపెట్టింది ఈ బ్యూటీ. ఆర్ఆర్ఆర్ లో చరణ్ యాక్టింగ్ కు ఫిదా అయిపోయానని, అతడికి…

మానుషి చిల్లర్.. మొత్తానికి అనుకున్నది సాధించింది. సినిమాల్లోకి ఇలా వచ్చిందో లేదో అలా రామ్ చరణ్ ను పొగడ్డం మొదలుపెట్టింది ఈ బ్యూటీ. ఆర్ఆర్ఆర్ లో చరణ్ యాక్టింగ్ కు ఫిదా అయిపోయానని, అతడికి పెళ్లయిందని తెలిసి చాలా బాధపడ్డానని, లేదంటే చరణ్ తో డేటింగ్ చేసేదాన్నంటూ చాలా స్టేట్ మెంట్స్ ఇచ్చింది.

మొత్తానికి ఆమె ప్రయత్నం ఫలించింది. చరణ్ సరసన కాకపోయినా, ప్రస్తుతానికి మరో మెగా హీరో సరసన ఆమెకు ఆఫర్ వచ్చింది. వరుణ్ తేజ్ కొత్త సినిమాలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా ఎంపికైంది.

2017లో మిస్ వరల్డ్ గా గెలిచిన తర్వాత ఇండస్ట్రీకి రావడానికి చాలా టైమ్ తీసుకుంది ఈ బ్యూటీ. మొత్తానికి బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ సరసన ఓ సినిమా చేసింది. కానీ అది పెద్ద ఫ్లాప్ అయింది. సరిగ్గా అదే టైమ్ లో వరుణ్ తేజ్ సినిమా ఆఫర్ ఆమెను వరించింది.

సోనీ పిక్చర్స్ సంస్థ వరుణ్ తేజ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం మానుషి అయితే సరిగ్గా సరిపోతుందని అంతా భావించారు. అలా మానుషి, మెగా కాంపౌండ్ లోకి ఎంటరైంది.

శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఈరోజు ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది. వరుణ్ తేజ్ ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ గా కనిపించనున్నాడు. తెలుగు-హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.