రాజ్ డికె లతో నాగశౌర్య

రాజ్ డికే లు ఇప్పుడు నేషనల్ లెవెల్ లో పేరు సంపాదించేసారు. డి ఫర్ దోపిడి అనే తెలుగు సినిమాతో ప్రయాణం ప్రారంభించిన ఆ ఇద్దరూ, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో ఫుల్…

రాజ్ డికే లు ఇప్పుడు నేషనల్ లెవెల్ లో పేరు సంపాదించేసారు. డి ఫర్ దోపిడి అనే తెలుగు సినిమాతో ప్రయాణం ప్రారంభించిన ఆ ఇద్దరూ, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో ఫుల్ పేరు సంపాదించేసారు. 

అక్కడితో ఆగకుండా తెలుగులో చిన్న, మీడియం సినిమాలు తీయడం మొదలుపెట్టారు. ఆ మధ్య సినిమా బండి అనే సినిమా తీసి ఆన్ లైన్ లో విడుదల చేసారు ఈ రాజ్ నిడమోరు అండ్ డికె కృష్ణ. 

ఇప్పుడు అదే సినిమా అందించిన డైరక్టర్ కాండ్రేగుల ప్రవీణ్ తో మరో సినిమా ప్లాన్ చేసారు. నాగశౌర్య హీరో గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 

ఓ వైవిధ్యమైన సబ్జెక్ట్ తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు రాజ్ డికె. మిగిలిన స్టార్ కాస్ట్ ఇంకా ఇతర వివరాలు తెలియాల్సి వుంది.