పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్‌పై మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ పులికేశి లోకేశ్ మాలోకమని వెటకరించారు. జనం లేకపోవడంతో పాదయాత్ర వెలవెలపోతోందని అవహేళన చేశారు. పాదయాత్రతో లోకేశ్‌కు ఉన్న ఆ కాస్త పరువు కూడా పోయిందని విమర్శించారు.
పాదయాత్ర దెబ్బతో టీడీపీ పాతాళలోకంలోకి జారుకుంటోందని విమర్శించారు. లోకేశ్ పాదయాత్రతో టీడీపీ నేతలు ఇళ్లలో నెత్తిపై తడి గుడ్డ వేసుకుని పడుకున్నారన్నారు. వారాహి వాహనంతో పవన్ జనంలోకి వస్తే… లోకేశ్ పాదయాత్ర మరింత దారుణంగా జనం లేక వెలవెలపోతుందనే భయం టీడీపీ నేతలకు పట్టుకుందన్నారు. దీంతో నాలుగు నెలలు వారాహి వాహనంతో రావద్దని పవన్‌కల్యాణ్ కాళ్లావేళ్లా పడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ వస్తే లోకేశ్ పాదయాత్ర ఎత్తిపోతుందనే భయంతో టీడీపీ నేతలు ఆ విధంగా చేస్తున్నారని విమర్శించారు.
పాదయాత్రలో ఏం మాట్లాడుతారో, ఏం చేస్తారో తెలియదన్నారు. టీడీపీని పూర్తిగా చంపేశాడన్నారు. అధికారంలోకి వస్తామని టీడీపీ కల కంటోందన్నారు. మొదట లోకేశ్ మంగళగిరిలో గెలవాలని హితవు పలికారు. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేశ్ రాష్ట్ర నాయకుడు అవుతాడట అని వెటకరించారు. దమ్ము, ధైర్యం, సిగ్గు, శరం , రాయలసీమ రక్తం మీ ఒంట్లో వుంటే 175 నియోజక వర్గాల్లో పోటీ చేస్తామని చెప్పాలని లోకేశ్‌కు సవాల్ విసిరారు. అధికారానికి కావాల్సిన 88 సీట్లలో పోటీ చేస్తామని పవన్‌కల్యాణ్ చెప్పగలరా? అని ఆయన సవాల్ విసిరారు.
కొడాలి నాని, అనిల్‌కుమార్ యాదవ్ బూతులు తిడుతున్నారని అంటుంటారని, కానీ తాము తిడితే తట్టుకోలేరని ఆయన అన్నారు. టీడీపీ నేతలు బూతులు తిడితే మాత్రం ఇళయరాజా సంగీతంలా వుంటుందా? అని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు. తాము ప్రతి ఎన్నికల్లోనూ పొత్తులేకుండానే బరిలో నిలుస్తామన్నారు. చంద్రబాబు ఎప్పుడైనా పొత్తు లేకుండా గెలిచాడా? అని ఆయన ప్రశ్నించారు.