క‌మ్మ వాళ్ల ఉద్య‌మ‌మేనా? ప‌వ‌న్ కూడా రారా?

రాజ‌ధాని ప్రాంతంలో నిర‌స‌న‌లు..ఒక సామాజిక‌వ‌ర్గం వారు చేప‌ట్ట‌గా, ఒక సామాజిక‌వ‌ర్గం పెత్త‌నం ఉండే పార్టీ వాటికి వంత పాడుతూ ఉండ‌గా, ఒక సామాజిక‌వ‌ర్గానికి చెందిన మీడియా వాటిని హైలెట్ చేస్తూ ఉండ‌గా సాగుతున్నవి! అది…

రాజ‌ధాని ప్రాంతంలో నిర‌స‌న‌లు..ఒక సామాజిక‌వ‌ర్గం వారు చేప‌ట్ట‌గా, ఒక సామాజిక‌వ‌ర్గం పెత్త‌నం ఉండే పార్టీ వాటికి వంత పాడుతూ ఉండ‌గా, ఒక సామాజిక‌వ‌ర్గానికి చెందిన మీడియా వాటిని హైలెట్ చేస్తూ ఉండ‌గా సాగుతున్నవి! అది క‌మ్మ సామాజిక‌వ‌ర్గం అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 

క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన మీడియా వ‌ర్గాలు అమరావ‌తి ఆందోళ‌న‌ల‌ను ఒక రేంజ్ లో హైలెట్ చేస్తూ ఉన్నాయి. ఎంత‌లా ఉంటే.. మొత్తం ఏపీ దిగ్బంధం అయిపోయినా.. పెట్ట‌లేని హెడ్డింగుల‌ను అవి వాడేస్తూ ఉన్నాయి. ఆ మీడియా వ‌ర్గాల్లో జ‌గ‌న్ మీద‌, జ‌గ‌న్ నిర్ణ‌యాల మీద ఫైర్ అయిపోతున్న అమ‌రావ‌తి వాసుల పేర్ల‌ను చూస్తే.. వాటిల్లో క‌మ్మ ద‌నం ఉట్టిప‌డిపోతూ ఉంది! ఈ నేప‌థ్యంలో ఈ ఉద్యమం ఒక సామాజిక‌వ‌ర్గానికి సంబంధించిన స‌మ‌స్య‌గా ఉంది. దీన్ని కులోద్య‌మం అనాలేమో!

ఒక కులం ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగానే అమరావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించార‌ని అనేక మంది అభిప్రాయ‌ప‌డుతూ వ‌చ్చారు. ఇప్పుడు మూడు రాజ‌ధానుల ఫార్ములాపై గ‌గ్గోలు పెడుతున్న‌ది ఆ కులం వాళ్లే అవుతుండ‌టంతో.. మొద‌టి అభిప్రాయానికి మ‌రింత బ‌లం చేకూరుతూ ఉంది. ఒకవైపు అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌కు అనేక మంది మేధావులు కూడా వ‌త్తాసు పలుకుతూ ఉండ‌గా, ఆ కులం వాళ్లు మాత్రం.. అవ‌న్నీ లేదు, అమ‌రావ‌తే అని అంటున్నారు.

ఇంత‌జేసీ అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ఏమీ ర‌ద్దు చేయ‌లేదు. అక్క‌డ నుంచి కూడా పాల‌న సాగుతుంద‌ని సీఎం చెప్పారు. అయినా అక్క‌డి వారి, ఆ కుల‌స్తుల ఆశ తీర‌డం లేదు. తాము ఏమైనా చేయ‌గ‌ల‌మ‌నే ఉద్దేశంతో వారు ఇలా రోడ్డు ఎక్కిన‌ట్టుగా క‌నిపిస్తున్నారు.  చంద్ర‌బాబు నాయుడు కూడా మ‌రో మొహ‌మాటం లేకుండా.. త‌మ కుల‌స్తుల ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ప‌లుకుతున్నార‌ని స్ప‌ష్టం అవుతోంది. రాయ‌ల‌సీమ ఏమైపోయినా ఫ‌ర్వాలేదు, ఉత్త‌రాంధ్ర విష‌యంలోనూ ఉత్త‌మాట‌లు చెబుతారు. అయితే..అమ‌రావ‌తి ప్ర‌యోజనాలు మాత్రం ముఖ్యం. 

ఇక క‌మ్మ వాళ్ల ఉద్య‌మానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఇంకా మ‌ద్ద‌తు ప‌లికిన‌ట్టుగా లేరు. మొద‌ట్లో మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్వీట్లేశారు. ఆ త‌ర్వాత త‌గ్గారు. క‌మిటీ అన్నారు, మంత్రి వ‌ర్గం అన్నారు.. ఇప్పుడు మాత్రం ఇంకా స్పందించ‌లేదు. గ‌తంలో ఒక కుల ప్ర‌యోజ‌నాల కోస‌మే అమ‌రావ‌తి అంటూ ప‌వ‌న్ కూడా వ్యాఖ్యానించారు. మ‌రి ఇప్పుడేమంటారో!