రవితేజ 16 కోట్లకు పైగా..శ్రీలీలకు జస్ట్ 50 లక్షలు. పవన్ కళ్యాణ్ 80 కోట్లు…శ్రీలీల జస్ట్ కోటి నుంచి కోటిన్నర. సరైన హీరోయిన్ పక్కన లేకుండా హిట్ కొట్ట గల దమ్ము మన హీరోలకు లేదు గాక లేదు. ఎంచుకుని మరీ హీరోయిన్లను తెచ్చుకోవాలి.
కానీ వాళ్ల రెమ్యూనిరేషన్ మాత్రం హీరోల రెమ్యూనిరేషన్ లో పది శాతం కూడా వుండదు. తమిళనాట నయన తార, త్రిష లాంటి వాళ్లు మాత్రం డిమాండ్ చేసి మరీ అయిదు కోట్లకు ఆ పైగా తీసుకోగలుగుతున్నారు. మన దగ్గర సమంత మాత్రమే మంచి పారితోషికం అందుకోగలుగుతోంది.
ఇప్పుడు తెలుగులో శ్రీలీల టాప్ హీరోయిన్. చేతిలో పది సినిమాల వరకు వున్నాయి. అయినా రెమ్యూనిరేషన్ కోటిన్నర దాటలేదు. కోటిన్నర చెబుతుంటే అమ్మో అంటున్నారు నిర్మాతలు. పైగా ఈమె నే కావాలని హీరోలు అడుగుతున్నారు. ఈమె వుంటే సినిమాకు ఓపెనింగ్, రన్ బాగుంటుందని నమ్ముతున్నారు. కానీ అదే టైమ్ లో అంత రెమ్యూనిరేషన్ నా అంటున్నారు.
ఇవన్నీ ఇలా వుంచితే అసలు ఇన్ని పెద్ద సినిమాలు ఒప్పుకుని, శ్రీలీల ఎలా డేట్ లు అడ్జస్ట్ చేస్తుందా అనే అనుమానాలు కూడ వినిపిస్తున్నాయి. శ్రీలీల నెలలో ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా నటించేస్తే తప్ప ఈ సినిమాలు అన్నీ పక్కాగా పూర్తి చేయడం సాధ్యం కాదు.
మరీ మెషీన్ లా వర్క్ చేయించేస్తే ఎంత గొప్ప హీరోయిన్ అయినా హెల్త్ డౌన్ అవుందేమో అన్న కామెంట్లు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.