మహేష్ సినిమాకు భారీ టార్గెట్

సూపర్ స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా షూట్ లో వుంది. ఈ లోగా ఓవర్ సీస్ మార్కెటింగ్ అన్నది ఆల్ మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ లో వుంది.  Advertisement వినిపిస్తున్న అంకెలు చాలా…

సూపర్ స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా షూట్ లో వుంది. ఈ లోగా ఓవర్ సీస్ మార్కెటింగ్ అన్నది ఆల్ మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ లో వుంది. 

వినిపిస్తున్న అంకెలు చాలా భారీగా వున్నాయి. ఈ లెక్క ప్రకారం అమెరికాలో సినిమాను కొనే బయ్యర్ గట్టెక్కాలంటే కనీసం నాలుగు మిలియన్ల డాలర్లు వసూలు చేయాల్సి వుంటుంది. ఎందుకంటే ఆ సినిమా యుఎస్ రేటు 16 కోట్ల మేరకు కోట్ చేస్తున్నారు కనుక.

సినిమా టోటల్ ఓవర్ సీస్ హక్కులు 24 కోట్ల మేరకు కోట్ చేస్తున్నారు. ఇందులో యుఎస్ వాటా 16 కోట్ల మేరకు వుంటుంది. అంటే పెట్టిన పెట్టుబడి వెనక్కు రావాలన్నా 4 మిలియన్ల డాలర్లు వసూలు చేయాలి అన్నమాట. 

ఇది చాలా పెద్ద ఫీట్. ఇప్పటి వరకు మహేష్ సినిమా ఏదీ అమెరికాలో ఇంత అమౌంట్ వసూలు చేయలేదు. త్రివిక్రమ్ అల వైకుంఠ పురములో సినిమా కూడా అమెరికా లో మూడున్నర మిలియన్లే చేసింది.

మరి ఏ లెక్కన ఈ కొత్త రెట్లు పుట్టుకువచ్చాయో? ఇటీవలి కాలంలో అమెరికాలో తెలుగు జనాలు పెరిగారు. తెలుగు సినిమాలు బానే చేస్తున్నాయి అనే లెక్కన కోట్ చేస్తున్నారు అనుకోవాలేమో? పైగా ఈ సినిమా ఆగస్టు విడుదల అయితే ఒకలా వుంటుంది. సంక్రాంతి విడుదల అయితే పోటీ మరోలా వుంటుంది. బయ్యర్లు అది కూడా లెక్కలోకి తీసుకోవాల్సి వుంటుంది.