పుష్ప సెకెండాఫ్ పై సుకుమార్ రియాక్షన్

తాజాగా థియేటర్లలోకి వచ్చిన పుష్ప సినిమాపై నెగెటివ్ కామెంట్స్ పడిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా సెకెండాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టు అనిపించిందని, నిడివి కావాలనే పెంచినట్టున్నారని చాలా విమర్శలు చెలరేగాయి. వీటిపై…

తాజాగా థియేటర్లలోకి వచ్చిన పుష్ప సినిమాపై నెగెటివ్ కామెంట్స్ పడిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా సెకెండాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టు అనిపించిందని, నిడివి కావాలనే పెంచినట్టున్నారని చాలా విమర్శలు చెలరేగాయి. వీటిపై పరోక్షంగా స్పందించాడు దర్శకుడు సుకుమార్. పుష్ప పార్ట్-2 కోసం సెకెండాఫ్ లో లీడ్స్ ఎక్కువగా తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టంచేశాడు.

“పుష్ప అసలు కథంతా పార్ట్-2లోనే ఉంటుంది. దానికి లీడ్ గా పార్ట్-1లో చాలా సన్నివేశాలు పెట్టాల్సి వచ్చింది. పార్ట్-2 నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మీరు చూసిన సినిమాలో ఏ పాత్రలైనా కాస్త తగ్గినట్టు మీకు అనిపించాయో, పార్ట్-2లో అవన్నీ ఎలివేట్ అవుతాయి. పార్ట్-1లో ఉన్న పాత్రలే పార్ట్-2లో కూడా కనిపిస్తాయి. మరో 3 పాత్రలు యాడ్ అయ్యే అవకాశం ఉంది.”

ఫిబ్రవరి నుంచి పార్ట్-2 షూటింగ్ స్టార్ట్ చేస్తామని ప్రకటించిన సుకుమార్.. ఫహాద్ ఫాజిల్ విశ్వరూపాన్ని పార్ట్-2లో చూస్తారని అంటున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ఇదే టైమ్ కి లేదా ఇంతకంటే నెల రోజుల ముందే పార్ట్-2 థియేటర్లలోకి వస్తుందంటున్నాడు.

పార్ట్-2లో అనసూయతో పాటు చాలా పాత్రలకు ప్రాధాన్యం ఉంటుందన్నాడు సుక్కు. పార్ట్-2కు సంబంధించి స్క్రిప్ట్ రెడీగా ఉందని, సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యమని ప్రకటించాడు.