బాబూ నువ్వు చెప్పు…ఏంటీ..కొట్టమని డప్పు…
ఇదీ ఇటీవల టిక్ టాక్ లో హుక్ లైన్ గా మారింది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో పాటలోని ఈ లైన్స్ ఫుల్ పాపులర్ అయ్యాయి. ఇలాంటి టైమ్ లో అదే సినిమాలో తమన్నా సాంగ్ తాలూకా పిక్ వదిలారు. తమన్నా బర్త్ డే సందర్భంగా ఈ ఫోటో వదిలారు. ఈ పిక్ లో తమన్నా సైనికులు వాడే గెరిల్లా డ్రెస్ లాంటి ఫ్యాంట్ వేసుకుంది. పైన ఎంత వరకు వేసుకోవాలో, ఎంత వేసుకోవాలో అంతే వేసుకుంది.
ఇది చూసి మిలటరీ డ్రెస్ లో అయిటమ్ సాంగ్ ఏమిటి? అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతే కాదు..బాబూ నువ్వు చెప్పు..విప్పమని డ్రెస్సూ అంటూ ఫన్నీ కామెంట్లు వినిపిస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రారంభంలో మహేష్ డ్రెస్ చూసి కామెంట్లు వచ్చాయి. అప్పుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. మిలటరీ వేరు మిలటరీ ఇంటిలిజెన్స్ వేరు. అంటూ..మొత్తానికి మహేష్ డ్రెస్ కోడ్ ను దర్శకుడు సమర్థించారు.
మరి ఇప్పుడు ఈ మిలటరీ డ్రెస్ ఐటమ్ సాంగ్ కు అనిల్ రావిపూడి ఏమని క్లారిటీ ఇస్తారో? చూడాలి. ఏమైతేనేం ఈ డ్రెస్ లో తమన్నా మాంచి లుక్ లో కిక్ ఇచ్చేలాంటి ఫోజ్ ఇచ్చింది అన్నది వాస్తవం.