ప్ర‌ముఖులు ప్ర‌యాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం

రాజ‌కీయ‌, ఇత‌ర ప్ర‌ముఖులు ప్ర‌యాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం త‌లెత్తింది. దీంతో విమానం గాలిలో గంట‌పాటు చ‌క్క‌ర్లు కొట్టాల్సి వ‌చ్చింది. విమానం గ‌మ్య‌స్థానానికి బదులు మ‌రోవైపు వెళ్లాల్సి వ‌చ్చింది. Advertisement రాజ‌మ‌హేంద్ర‌వ‌రం నుంచి…

రాజ‌కీయ‌, ఇత‌ర ప్ర‌ముఖులు ప్ర‌యాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం త‌లెత్తింది. దీంతో విమానం గాలిలో గంట‌పాటు చ‌క్క‌ర్లు కొట్టాల్సి వ‌చ్చింది. విమానం గ‌మ్య‌స్థానానికి బదులు మ‌రోవైపు వెళ్లాల్సి వ‌చ్చింది.

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం నుంచి రేణిగుంట‌కు ఇండిగో విమానం బ‌య‌ల్దేరింది. న‌గ‌రి ఎమ్మెల్యే రోజా, మాజీ మంత్రి య‌నమ‌ల రామ‌కృష్ణుడితో పాటు 70 మంది ప్ర‌యాణికులు అందులో ఉన్నారు. రేణిగుంట‌కు చేరాల్సిన విమానంలో ఉన్న‌ట్టుండి సాంకేతిక లోపం త‌లెత్తింది. 

ఇటీవ‌ల త‌మిళ‌నాడులో హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం సంభ‌వించ‌డంతో, త్రివిధ ద‌ళాల అధిప‌తి బిపిన్ రావ‌త్ దంపతులు, ఇత‌ర సైనిక సిబ్బంది దుర్మ‌ర‌ణం పాలైన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో విమానంలో సాంకేతిక లోపం అని తెలియ‌గానే ప్ర‌యాణికులు ఒకింత ఆందోళ‌న‌కు గురయ్యారు. అయితే విమానాన్ని బెంగ‌ళూరు వైపు దారి మ‌ళ్లించారు. చివ‌రికి అంతా సుర‌క్షితంగా ల్యాండ్ అయ్యారు. దీంతో ప్ర‌యాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సాంకేతిక లోపం, ఇత‌ర అంశాల గురించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి వుంది.