సమంతకు కరోనా సోకిందా..?

హీరోయిన్ సమంతకు కరోనా సోకిందా? ఆమె ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉందా? నిన్నట్నుంచి సోషల్ మీడియాను ఊపేస్తున్న ప్రచారం ఇది. దీనిపై వెంటనే రియాక్ట్ అయింది సమంత టీమ్. సమంత పూర్తి ఆరోగ్యంగా ఉందని,…

హీరోయిన్ సమంతకు కరోనా సోకిందా? ఆమె ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉందా? నిన్నట్నుంచి సోషల్ మీడియాను ఊపేస్తున్న ప్రచారం ఇది. దీనిపై వెంటనే రియాక్ట్ అయింది సమంత టీమ్. సమంత పూర్తి ఆరోగ్యంగా ఉందని, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు నమ్మొద్దంటూ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఈ పుకారు ఎలా వచ్చింది..? 

సమంతకు కరోనా అనే పుకారు రావడానికి ఓ కారణం ఉంది. రీసెంట్ గా ఆమె కడప వెళ్లింది. అక్కడ ఓ షాప్ ఓపెనింగ్ లో పాల్గొంది. వందల మంది అభిమానుల మధ్య మాస్క్ లేకుండా ఉండాల్సి వచ్చింది. ఆ ఈవెంట్ లో పాల్గొని హైదరాబాద్ వచ్చిన వెంటనే ఆమెకు జలుబు, జ్వరం మొదలైంది. దీంతో ఆమెకు కరోనా లక్షణాలున్నట్టు కథనాలు పుట్టుకొచ్చాయి.

సమంత ఏమాత్రం అశ్రద్ధ వహించలేదు. వెంటనే ఆమె హైదరాబాద్ లో ఓ పెద్ద హాస్పిటల్ లో జాయిన్ అయింది. అన్ని రకాల టెస్టులు చేయించుకుంది. అది కేవలం ఫ్లూ జ్వరం అని తేలింది. సమంత ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉందని ఆమె మేనేజర్ ప్రకటించాడు.

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై యశోద అనే కొత్త సినిమా స్టార్ట్ చేసింది సమంత. మరోవైపు పుష్ప సినిమాలో ఐటెంసాంగ్ పూర్తిచేసింది. ఇవి కాకుండా సమంత చేతిలో మరో 2 సినిమాలున్నాయి. వీటిలో ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కూడా ఉంది.