కీలకమైన ఫంక్షన్ కు దర్శకుడే రాకపోతే ఎలా?

పుష్ప ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథి ఎవరనే చర్చ మొన్నటివరకు జోరుగా సాగింది. అయితే ఇప్పుడీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ఏకంగా దర్శకుకే గైర్హాజరయ్యాడు. అవును.. తన సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు…

పుష్ప ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథి ఎవరనే చర్చ మొన్నటివరకు జోరుగా సాగింది. అయితే ఇప్పుడీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ఏకంగా దర్శకుకే గైర్హాజరయ్యాడు. అవును.. తన సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు సుకుమార్ రాలేదు. ప్రత్యేక అతిథులు ఎవరొచ్చారనే చర్చ కంటే, సుకుమార్ ఎందుకు రాలేదనే చర్చ సభలో ఎక్కువైంది.

పుష్ప ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళి, కొరటాల చీఫ్ గెస్టులుగా వచ్చారు. కానీ సుకుమార్ మాత్రం రాలేదు. దీనికి కారణం ఆయన పుష్ప పోస్ట్-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండడమే. పైగా ఈ పనుల కోసం ఆయన ముంబయి వెళ్లాడు. అందుకే ఫంక్షన్ కోసం హైదరాబాద్ రాలేకపోయాడు.

నిజానికి ముంబయి నుంచి హైదరాబాద్ రావడం పెద్ద సమస్య కాదు. కావాలంటే తిరిగి ముంబయి వెళ్లిపోవచ్చు కూడా. కానీ పుష్ప పనులు అంత సాఫీగా జరగడం లేదు. 17వ తేదీ రిలీజ్ ఎందుకు పెట్టుకున్నారో తెలీదు కానీ, అంతా ఉరుకులు పరుగుల మీద పనులు చేస్తున్నారు. ఇక సుకుమార్ సంగతి సరేసరి.

మరో 3 రోజుల్లో ఓవర్సీస్ లో పుష్ప సినిమా ప్రీమియర్స్ పడాలి. ఓవైపు పనులన్నీ ఎక్కడివక్కడ పెండింగ్ లో ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో ఫంక్షన్ కోసం ముంబయి నుంచి హైదరాబాద్ వస్తే, ఎంత వద్దనుకున్నా ఒక రోజు వేస్ట్ అయిపోతుంది. ఈ సిచ్యుయేషన్ లో ఒక రోజు అంటే అది చాలా కీలకం. అందుకే అన్నీ ఆలోచించి సుకుమార్ డ్రాప్ అయ్యాడు. అల్లు అర్జున్ అన్నీ తానై ఫంక్షన్ ను రక్తికట్టించాడు.