హద్దు మీరిన అభిమానం.. అలియా సీరియస్!

ఏదైనా అభిమానం హద్దు లో ఉన్నంతవరకు బాగానే ఉంటుంది. హద్దు మీరితే ఇబ్బందులు వ‌స్తాయి. తాజాగా అలాంటి ఘ‌ట‌న‌నే బాలీవుడ్ న‌టి అలియా భట్‌ కు ఎదురైంది. అలియా ఇంట్లో ఏం చేస్తుందో అని…

ఏదైనా అభిమానం హద్దు లో ఉన్నంతవరకు బాగానే ఉంటుంది. హద్దు మీరితే ఇబ్బందులు వ‌స్తాయి. తాజాగా అలాంటి ఘ‌ట‌న‌నే బాలీవుడ్ న‌టి అలియా భట్‌ కు ఎదురైంది. అలియా ఇంట్లో ఏం చేస్తుందో అని తెలుసుకోవాల‌నుకున్న ఇద్ద‌రు వ్య‌క్తులు త‌న ప‌క్క ఇంటి డాబాపై నుండి కెమెరాల‌తో త‌న‌ ఫోటోలు తీశారంటూ అలియా వాపోయింది. 

త‌న ఫోటోలు తీయ‌డంతో అలియా తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ త‌న ఇన్ స్టాలో పోస్ట్ చేసింది… నేను ఇంట్లో ఉన్న‌ప్పుడు.. ఎవ‌రో నన్ను గ‌మ‌నిస్తున్న‌ట్లు అనిపించి ప‌క్క‌కు చూస్తే ఎవ‌రో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు మా ప‌క్క ఇంటి డాబాపై నుండి న‌న్ను కెమెరాతో వీడియోలు, ఫోటోలు తీస్తున్నారు.. ఇది స‌రైన‌దేనా?.. ఒక‌రి వ్య‌క్తిగ‌త విష‌యాల‌పై గోప్య‌త పాంటించ‌రా? అంటూ మండిప‌డ్డారు. 

ఎలాంటి వారి మ‌ధ్య అయినా దాట‌కూడ‌ని గీత ఒక‌టి ఉంటుంది.. వారు ఈ రోజు ఆ గీత దాటారు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తు, వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముంబై పోలీసులకు ట్యాగ్ చేసింది. ప్ర‌స్తుతం అలియా పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డంతో నెటిజ‌న్లు అంద‌రు ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.