ఆ హీరోయిన్ కు అంత రెమ్యూనిరేషన్?

అవసరం మనదైతే ఎంతయినా పెట్టాలి. ప్రస్తుతం టాలీవుడ్ వ్యవహారం అలాగే వుంది. దర్శకుడు బోయపాటి పరిస్థితి అలాగే వుంది. బాలయ్యతో చేయబోయే సినిమాకు మాంచి హీరోయిన్ కావాలి. కానీ బాలయ్య పక్కన మాంచి హీరోయిన్…

అవసరం మనదైతే ఎంతయినా పెట్టాలి. ప్రస్తుతం టాలీవుడ్ వ్యవహారం అలాగే వుంది. దర్శకుడు బోయపాటి పరిస్థితి అలాగే వుంది. బాలయ్యతో చేయబోయే సినిమాకు మాంచి హీరోయిన్ కావాలి. కానీ బాలయ్య పక్కన మాంచి హీరోయిన్ కావాలి.

కానీ బాలయ్య పక్కన హీరోయిన్ అంటే అంత వీజీ వ్యవహారం కాదని, దాదాపు అరడజను సినిమాల నుంచి తెలిసి వస్తున్న సత్యం. అందుకే బోయపాటి తన మాట కాదు అనని హీరోయిన్ కేథరిన్ ను తీసుకోవాలని అనుకున్నారు. ఆమె కూడా అందుకు ఓకె అనేసింది. అక్కడికి ఓ సమస్య తీరింది.

కానీ ఇక్కడ ఇంకో సమస్య వుంది. అదే రెమ్యూనిరేషన్. కేథరిన్ తెలుగులో బాగా పరిచయం వున్న హీరోయిన్ నే కానీ, మరీ కోటి రూపాయల రేంజ్ హీరోయిన్ మాత్రం కాదని బోగట్టా. కానీ ఆమె డిమాండ్ మాత్రం ఆ విధంగానే వున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో మరో ఖర్చు అయినా తగ్గించుకోవాలి కానీ, హీరోయిన్ విషయంలో తప్పదు అని బోయపాటి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

బాలయ్య పక్కన హీరోయిన్ దొరకడమే కష్టం. దొరికిన తరువాత లక్ష అటు ఇటు అయినా ఓకె అని డిసైడ్ అయిపోయి, 80 లక్షలకు సెటిల్ చేసినట్లు తెలుస్తోంది. ఆ విధంగా కేథరిన్ రెమ్యూనిరేషన్ 80 లక్షలకు సెటిల్ చేసి, ఓకె చేయించుకున్నట్లు బోగట్టా. బోయపాటి-బాలయ్య కాంబినేషన్ లో మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు 70 కోట్ల ఖర్చును అంచనా వేస్తున్న సంగతి తెలిసిందే.