విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ సినిమా వెంకీమామ బాక్సాఫీస్ వద్ద బాగానే సందడి చేసింది తొలి మూడురోజులు. సోమ, మంగళ వారాలు డిప్ కావడం అన్నది మామూలే. అయితే థియేటర్లలో మరో ఇరవై రోజులకు పైగా వుండాల్సిన సినిమాలు లెక్క తీస్తే వెంకీమామతో కలిసి మహా అయితే అయిదుసినిమాలు. వీటిలో దబాంగ్ ను పక్కన పెట్టొచ్చు. ప్రతిరోజూ పండగే, రూలర్, ఇద్దరిలోకం ఒకటే, వెంకీ మామ ఈ సినిమాలే జనవరి 9 వరకు జనాలకు వుండేవి.
అందువల్ల రోజూ అంతో ఇంతో షేర్ అయితే వస్తుంది కానీ డెఫిసిట్ లోకి వెళ్లిపోదు. పైగా సురేష్ మూవీస్ స్వంత విడుదల కాబట్టి, థియేటర్ల ప్లానింగ్ బాగుంటుంది. సోమవారం నాటికే హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లో ఓ థియేటర్ తగ్గించి, షేర్ డివైడ్ కాకుండా చూసుకున్నారు. అన్ని చోట్లా ఇధే ప్లానింగ్ కనిపిస్తోంది.
ఇదిలా వుంటే వెంకీమామ సినిమా కు వచ్చిన ఓపెనింగ్స్ హడావుడి చూసిన తరువాత వెంకటేష్ క్రేజ్ అంతోవుంది కానీ, చాలా మంది సీనియర్ హీరోల మాదిరిగా దారుణంగా పడిపోలేదని అర్థం అయింది. వెంకీ మామ సినిమా చాలా డిలే అయింది. ఇక చకచకా సినిమాలుచేయాలని వెంకటేష్, ఆయన సోదరుడు సురేష్ బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వెంకీ చేతిలో మూడు ప్రాజెక్టులు రెడీగా వున్నాయి. అసురన్ రీమేక్ ముందుగా పట్టాలు ఎక్కుతుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్న తరుణ్ భాస్కర్ ప్రాజెక్టు వుంది. నక్కిన త్రినాధరావు ప్రాజెక్టు వుంది. ఈ మూడింటిని చకచకా చేపట్టి, ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.