టాలీవుడ్ కు మరో స్టూడియో వచ్చింది. అల్లు స్టూడియో. అల్లు అరవింద్ ఫ్యామిలీ నిర్మిస్తున్న స్టూడియో. గండి పేట దగ్గర సుమారు ఎనిమిది ఎకరాల్లో ఈ స్టూడియోను నిర్మిస్తారు. నానక్ రామ్ గుడా రామానాయుడు స్టూడియోకి సమీపంలో వుంటుదీ స్థలం.
నానక్ రామ్ గుడా రామానాయుడు స్టూడియోను క్లోజ్ చేస్తుండడం, ఇటీవల వెబ్ సిరీస్ లు, గేమ్ షో లు పెరిగి, ఫ్లోర్ లు పర్మనెంట్ గా రెంట్ కు తీసుకునే పద్దతి పెరగడం, అలాగే అన్నపూర్ణ స్టూడియోలో కోన్ని పర్మనెంట్ సెట్ లు తీసేయడం వంటి పరిణామాలు సంభవించాయి.
అందువల్ల ఇప్పుడు ఖాళీగా స్థలం వుంచుకునే కన్నా, కొన్ని ఫ్లోర్ లు కడితే కచ్చితంగా డిమాండ్ వుంది. పైగా తమ స్వంత సినిమాలు వున్నాయి. స్వంత హీరోలు వున్నారు. మెగా హీరోలు వున్నారు. అందువల్ల బిజినెస్ కు లోటు ఏమీ వుండదు.
అన్ని విధాలా ఆలోచించి, అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా స్టూడియో పేరు ప్రకటించారు అరవింద్ అండ్ ఫ్యామిలీ. లాంఛనంగా సైట్ లో అల్లు స్టూడియోస్ అని బోర్డు పెట్టి, కొబ్బరికాయ కొట్టి వచ్చినట్లు తెలుస్తోంది.
నిజానికి స్టూడియో కట్టాలని మెగాస్టార్ చిరంజీవికి ఎప్పటి నుంచో ఐఢియా వుంది. కానీ ఆయన అడుగు ముందుకు వేయలేకపోయారు. ఇలాంటి టైమ్ లో అరవింద్ చకచకా ప్లానింగ్ చేసి, అమలు కూడా చేసేస్తున్నారు.