బాబుని జైలుకెళ్ళమంటున్న ఎర్రన్న?

శుభం కోరుకోమంటే ఇలాగేనా చెప్పేది. అందునా పెద్దవాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు దీవించేది ఇలాగేనా. అసలే చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఇపుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. Advertisement టీడీపీ…

శుభం కోరుకోమంటే ఇలాగేనా చెప్పేది. అందునా పెద్దవాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు దీవించేది ఇలాగేనా. అసలే చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఇపుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

టీడీపీ పుట్టిన తరువాత ఇంతటి ఘోర పరాభవం ఎపుడూ జరగలేదు. కేవలం 23 సీట్లకే ఆ పార్టీ పరిమితం అయింది. దానికి తోడు క్యాడర్ లో జోష్ ఎక్కడా కానరాక భవిష్యత్తు మీద పై నుంచి దిగువదాకా అందరూ బెంబేలెత్తున్న సీన్ కనిపిస్తోంది.

ఈ టైంలో సీపీఐ నారాయణ ఏదైతే టీడీపీ నేతలు వినకూడదు అనుకుంటున్నారో అలాంటి పిడుగులాంటి వార్తనే చెప్పుకొచ్చారు. బాబును ఓ వైపు తమవైపు రమ్మని పిలుస్తూనే మోడీకి వ్యతిరేకంగా గొంతెత్తి పోరాడమంటున్నారు.పోరాడితే పోయేదేముందు జైలుకు వెళ్ళడం తప్ప అని తమదైన కమ్యూనిస్ట్ నీతి సూక్తులను కూడా చెబుతున్నారు.

మోడీ సర్కార్ తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా బాబుని గొంతు విప్పమంటున్నారు. మోడీ ఏం చేస్తారు. పెడితే జైలులోనే కదా పెడతారు. అయినా అది కూడా మంచిదే. జనాలు మెచ్చి మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చేబెడతారేమోనని బాగానే ఉబ్బేస్తున్నారు నారాయణ. అంటే బాబు జైలుకెళ్ళినా సింపతీ వస్తుంది అది మంచిదే కదా అని పాత మిత్రుడిగా చెబుతున్నారు.

అంతా బాగానే ఉంది కానీ తీరా మోడీకి ఎదురెళ్ళి నారాయణ చెప్పినట్లుగానే బాబు  జైలుకే వెళ్తే అనుకున్న సింపతీ రాక అక్కడే ఇరుక్కుపోతే ఎర్రన్న ఏమైనా ఆరుస్తారా, తీరుస్తారా. ఇది కదా  అసలు బాధ.  మొత్తానికి బాబు జైల్ అంటూ రెండింటినీ మిక్స్ చేసి కామ్రెడ్ చెప్పడంతో టీడీపీ తమ్ముళ్ళు నారాయణ నారాయణ అనుకుంటున్నారుట.

కాపు ఓట్ల కోసమే దాసరి కార్డు వాడారా?

నన్ను దించాలని ట్రై చేస్తే నిజంగా హర్ట్ అవుతాను