తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. ఇదీ తన తనయుడికి చంద్రబాబు ఇచ్చుకున్న వారసత్వ హోదా! ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని తన ప్రైవేట్ ప్రాపర్టీగా చేసుకున్న చంద్రబాబు నాయుడు తన తనయుడిని తన రాజకీయ వారసుడిగాప్రొజెక్ట్ చేసుకోవడానికి దాదాపుగా పదేళ్ల నుంచి రకరకాలుగా తంటాలు పడుతూ ఉన్నారు. ఎదిగిన కొడుకు ఏ తండ్రికి అయినా అండగా ఉంటాడు. అయితే 40 యేళ్ల పై వయసు వచ్చినా లోకేష్ ను ఇంకా తండ్రే నిలబెట్టడానికి పాట్లు పడుతూ ఉన్నాడు. ఆ పాట్లతో మొదటికే మోసం వస్తోంది కూడా!
ఈ విషయం గురించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక మంచి ఉదాహరణ చెప్పాడు. వెనుకటికి ఏదో దేశంలో విమానప్రమాదం జరిగిందట. ఆ ఘటనలో కొంతమంది ప్రాణాలు కూడా పోయాయట. ఇంతకీ విమాన ప్రమాదం ఎందుకు జరిగిందని ఒక కమిటీ ఏర్పాటు అయ్యింది. ఆ కమిటీ విచారణలో నిర్ఘాంతపోయే విషయం బయటపడింది. అదేమిటంటే.. ఆ విమానాన్ని నడిపిన పైలెట్ కు ఒక కొడుకు ఉన్నాడు. వాడేమో చిన్న పిల్లాడు. అయితే తన తండ్రిలాగానే తను కూడా విమానాన్ని నడిపేయాలనేది వాడి విపరీత కోరిక. విమానం తోలే అనుభవం, కనీసం జ్ఞానం లేకపోయినా ఆ పైలెట్ తనతో పాటు వాడిని తీసుకెళ్లాడు. అంతేకాదు.. వాడి చేతికి విమానం స్టీరింగ్ ను కూడా ఇచ్చాడు. కొడుకుపై విపరీతమైన ప్రేమ, కొడుకును కూడా తనలాగే పైలెట్ గా చూసుకోవాలనే ఉత్సాహం అనే మూర్ఘత్వంతో అతడు చేసిన పని ఫలితంగా విమానం ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంతో విమానంలో ఉన్న వారిప్రాణాలు కూడా పోయాయి.
పుత్రులపై అనాలోచిత ప్రేమను ఉదాహరిస్తూ రామ్ గోపాల్ వర్మ ఈ ఉదాహరణను వివరించాడు. ఇప్పుడు విమానం కు పట్టిన పరిస్థితే తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితాన్ని పెట్టుకున్న వారికి పట్టేలా ఉందనేది వర్మ విశ్లేషణ. సినిమాల పరంగా వర్మను ఇప్పుడు విమర్శంచవచ్చేమో కానీ విశ్లేషణల్లో వర్మ మాత్రం అంత తేలికైన వాడు కాదు. లాజికల్, ప్రాక్టికల్ థింకింగ్ లో వర్మ తోపే!
లోకేష్ తీరు తెన్నులను గమనిస్తే.. వర్మ చెప్పిన విశ్లేషణ వాస్తవానికి దగ్గరగా అనిపిస్తుంది. ఆ సంగతలా ఉంటే.. తెలుగుదేశం వారసత్వ నేత లోకేష్ బాబు రోడ్డున పడి అడ్డగోలుగా మాట్లాడుతూ తన నాయకత్వ స్థాయిని నిరూపించుకుంటూ ఉండగా.. ఆయన రాజకీయ హోదా మారబోతోంది. లోకేష్ త్వరలోనే మాజీ ఎమ్మల్సీ కాబోతున్నారు.
మార్చి నెలాఖరుతో లోకేష్ ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా.. మంత్రి పదవి కోసం దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యారు లోకేష్. గతంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభకు నామినేట్ అయ్యి, ప్రధాని గా బాధ్యతలు తీసుకుంటే చంద్రబాబు తెగ విమర్శించే వారు! మన్మోహన్ సింగ్ లాంటి మేధావి రాజ్యసభకు వెళితే చంద్రబాబు తెగ ఆక్షేపించేవారు!దొడ్డిదారిన ప్రధాని అయ్యారంటూ నోటికొచ్చినట్టుగా చంద్రబాబు పేలేవాడు.
తీరా తన తనయుడిని మాత్రం అధికారం ఉపయోగించి ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశాడు. అంత చేసినా సదరు తనయుడు ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయాడు. పప్పు సుద్ద అనిపించుకుంటున్నాడు. మరి మేధావులను తూలనాడిన చంద్రబాబుకు ఇంట్లో మేధావిని అర్థం చేసుకోలేకపోయాడు.
మరి ఇక నుంచి నారా చంద్రబాబు పుత్రరత్నం నారా లోకేశం ను మాజీ ఎమ్మెల్సీగా సంబోధించాలి. పెద్దలసభ మాజీ సభ్యుడు! ఎంతోమంది నాయకులనుతనే తయారు చేసుకున్నట్టుగా, దేశానికి ప్రధానులను రాష్ట్రపతులను తనే నియమించినట్టుగానే చంద్రబాబుకు తనతనయుడు చిన్న వయసులోనే పెద్దల సభ మాజీ సభ్యుడు అనే పెద్ద హోదాను సొంతం చేసుకోవడం తన ఘనతే అని చెప్పుకుంటారేమో!
కేవలం లోకేష్ ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియడమే కాదు.. ఏపీ శాసనమండలిలోనే తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖాళీ కాబోతోంది. టీడీపీ చేతిలో అధికారం ఉన్నప్పుడు ఆ పార్టీ తరఫున శాసనసభ నుంచి మండలికి ఎన్నికైన వారు, నామినేటెడ్ సభ్యులు.. అంతా పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవడం లాంఛనమే ఇక. ఏపీ మండలిలో తెలుగుదేశం పార్టీ ఇలా తన ప్రాతినిధ్యాన్ని పూర్తిగా కోల్పోతోంది.