నా సామిరంగా.. సెట్స్ పైకొచ్చాడు

చిన్న గ్యాప్ తర్వాత నాగార్జున సెట్స్ పైకొచ్చాడు. ది ఘోస్ట్ పరాజయం తర్వాత మరో సినిమా ప్రకటించడానికి టైమ్ తీసుకున్న ఈ హీరో, తన పుట్టినరోజు సందర్భంగా 'నా సామిరంగా' టైటిల్ తో ఓ…

చిన్న గ్యాప్ తర్వాత నాగార్జున సెట్స్ పైకొచ్చాడు. ది ఘోస్ట్ పరాజయం తర్వాత మరో సినిమా ప్రకటించడానికి టైమ్ తీసుకున్న ఈ హీరో, తన పుట్టినరోజు సందర్భంగా 'నా సామిరంగా' టైటిల్ తో ఓ సినిమా ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా సెట్స్ పైకొచ్చింది.

ఈరోజు ఏఎన్నార్ శతజయంతి. ఈ సందర్భంగా 'నా సామిరంగా' రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేశారు. హైదరాబాద్ లో సినిమా రెగ్యులర్ షూట్ మొదలవ్వగా.. ఫైట్ మాస్టర్ వెంకట్ నేతృత్వంలో నాగార్జునపై ఓ యాక్షన్ ఎపిసోడ్ షూట్ స్టార్ట్ చేశారు.

కెరీర్ లో నాగార్జునకు ఇది ప్రతిష్టాత్మక 99వ చిత్రం. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఓ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ తో సినిమాను ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

నిజానికి బెజవాడ ప్రసన్నకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా అనుకున్నారు. కానీ అతడు ఈ సినిమాకు కథ-డైలాగ్స్ విభాగాల వరకు మాత్రమే పరిమితమయ్యాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాను పక్కా ప్లానింగ్ తో, టైట్ షెడ్యూల్స్ తో పూర్తిచేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే, వచ్చే ఏడాది సంక్రాంతికి ఎట్టిపరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయాలనేది టార్గెట్.

బంగార్రాజుతో సంక్రాంతి బరిలో సక్సెస్ అందుకున్నాడు నాగ్. ఆ సెంటిమెంట్ ప్రకారం, 'నా సామిరంగా' సినిమాను కూడా సంక్రాంతికే తీసుకురావాలని అనుకుంటున్నాడు. కీరవాణి ఈ సినిమాకు సంగీత దర్శకుడు.