ఏపీలో స్థానిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నట్టుగా ఉంది. పంచాయతీ, జడ్పీ-ఎంపీటీసీ ఎన్నికలతో పాటు.. మున్సిపల్ ఎన్నికలను కూడా నిర్వహించాల్సి ఉంది. దాదాపు ఏడాది కిందటే వీటన్నింటి పదవీ కాలం ముగిసింది. అయితే అప్పట్లో చంద్రబాబు నాయుడి సర్కారు ఈ ఎన్నికల నిర్వహణకు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఆ ఎన్నికలు జరగాల్సి ఉంది.
అలాగే ఈ ఎన్నికలకు చట్టపరంగా కూడా కొన్ని కొన్ని చిన్న ఇబ్బందులు తలెత్తాయి. అన్నీ ముగిసీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్నట్టుగా ఉంది. ఈ విషయంపై మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు.
వచ్చే ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. స్థూలంగా దగ్గర్లోనే మున్సిపాలిటీల- కార్పొరేషన్ ల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇక ఇదే సమయంలో పంచాయతీల దగ్గర నుంచి ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికలు కూడా త్వరలోనే జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రానున్న మూడు నెలల్లో.. అటు పల్లెలు, ఇటు పురాలు ఓటెత్తనున్నాయి!