ఉక్కులో ఆ వాటాలూ లాగేస్తారా…?

విశాఖ ఉక్కు అంధ్రుల హక్కు కాదు… అది తుక్కు తుక్కు అన్నది నిజం. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి డౌట్లు అసలే అవసరం లేదు అంటున్నారు. విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం అయితే పూర్తి…

విశాఖ ఉక్కు అంధ్రుల హక్కు కాదు… అది తుక్కు తుక్కు అన్నది నిజం. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి డౌట్లు అసలే అవసరం లేదు అంటున్నారు. విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం అయితే పూర్తి క్లారిటీతో ఉంది. ఎన్ని సార్లు దాని మీద ఎవరు ఏమి అడిగినా కచ్చితమైన నిశ్చలమైన ఒకే ఒక సమాధానం కేంద్రం ఇవ్వగలదు, ఇస్తోంది కూడా.

విశాఖ ఉక్కు విషయంలో ఏమి చేస్తున్నారు అని ఒక ప్రశ్న కేంద్రానికి తాజాగా వచ్చింది. ఏమి చేయడమేంటి దాన్ని ప్రైవేటీకరిస్తున్నాం అంతే అని కేంద్ర పెద్దలు ఖండితంగా చెప్పేశారు. ఈ విషయంలో కేంద్ర క్యాబినేట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది అని గుర్తు చేశారు కేంద్ర ఉక్కు మంత్రి ఫగ్గన్ సింగ్.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విస్తరించే ఆలోచన కానీ మరోటి కానీ ఏదీ కేంద్రానికి లేనే లేదని ఆయన స్పష్టం చేశారు. అంతే కాదు మరో కొత్త విషయాన్ని ఆయన వెల్లడించారు. విశాఖ ఉక్కు కర్మాగారం అనుబంధంగా ఉన్న సంస్థలు, జాయింట్ వెంచర్ లో ఉన్న వాటాలను కూడా వెనక్కి తీసుకుంటామని తాజా కబురు చెప్పారు.

దీన్ని బట్టి అర్ధం చేసుకోవాల్సింది ఏంటి అంటే మా వాటాలు అన్నీ మేము తీసేసుకుంటాం, ఆనక అమ్మేస్తామని. అయినా సరే మా ఉక్కు మా ఇష్టం అని చెబుతున్నా వినకపోతే ఆంధ్రుల హక్కు అంటూ మాట్లాడుతూంటే ఎపుడూ ఇదే రకమైన సమాధానం చెబుతామనే కేంద్ర పెద్దలు అంటున్నారు. దశల వారీగా తాము చేయబోయే పనుల వివరాలను కూడా చెబుతూ విశాఖ ఉక్కు మీద ఆశలు వదిలేసుకోమంటున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేట్ హక్కు. ఇదీ లేటెస్ట్ నినాదం. అర్ధం కాకపోతే మళ్లీ అడిగినా కేంద్ర మంత్రులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.