పుష్ప..శానా వుంది యవ్వారం

సుకుమార్ మామూలుగానే ఓ సినిమాకు రెండు సినిమాల సీన్లు రాసుకుంటారు. అలాంటిది రెండు భాగాల సినిమాగా తీయగలిగిన స్కోప్ వున్న కథకు ఇంకెంత వుంటుంది. పుష్ప పార్ట్ వన్ ట్రయిలర్ చూస్తే ఇలాగే అనిపిస్తుంది. …

సుకుమార్ మామూలుగానే ఓ సినిమాకు రెండు సినిమాల సీన్లు రాసుకుంటారు. అలాంటిది రెండు భాగాల సినిమాగా తీయగలిగిన స్కోప్ వున్న కథకు ఇంకెంత వుంటుంది. పుష్ప పార్ట్ వన్ ట్రయిలర్ చూస్తే ఇలాగే అనిపిస్తుంది. 

ట్రయిలర్ నిండా ఎన్ని సీన్లు పరుచుకున్నాయో. రెండు నిమిషాల 31 సెకెండ్ల టీజర్ లో ప్రతి సీన్ కూడా కథ గురించి ఆలోచించేలా చేసేవే. ఏదో సీన్లు కట్ చేసి పేస్ట్ చేసినట్లు లేదు టీజర్.

సినిమాలొ అన్ని రకాల హంగులు ఫుల్ రేంజ్ లో వున్నాయని చెప్పకనే చెప్పింది. ఎర్రచందనం బ్యాక్ర్ డ్రాప్, పోలీసుల వేట, రాజకీయాల సంపాదన, అనసూయ, సునీల్, అజయ్ ఘోష్ లాంటి భిన్నమైన క్యారెక్టర్లు, వీటన్నింటి మధ్య కాస్త గడుసైన ప్రేమకథ, ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా వున్నాయి.

వీటన్నింటినీ గుదిగుచ్చుతూనే, ట్రయిలర్ ను ఇంట్రస్టింగ్ గా కట్ చేయడంలో దర్శకుడు సుకుమార్ చాకచక్యం కనిపించింది. కంపారిటివ్ గా రంగస్థలం కన్నా రఫ్ లుక్ వుంది. టేకింగ్ లోనూ, క్యారెక్టర్లలోనూ. రంగస్థలం రఫ్ గా కనిపించినా, అందులో అంతర్లీనంగా సున్నితం, అందం వుంటుంది. పుష్పలో బోల్డ్ నెస్, రఫ్ నెస్ కాస్త ఓ పాలు ఎక్కువ వుంది.

సినిమాటోగ్రఫీ, నేఫథ్య సంగీతం బాగున్నాయి. మొత్తం మీద ప్రామిసింగ్ ట్రయిలర్ ఇది.