అఖండ…జిల్లాకు 15 లక్షలు

అవును..ప్రభుత్వం సినిమా టికెట్ల మీద అనిశ్చిత వైఖరితో వుండడం, అలా అని కొత్త జీవో ను కచ్చితంగా అమలు చేయకపోవడం వల్ల ప్రతి జిల్లాలో అఖండ డిస్ట్రిబ్యూటర్లకు అవుతున్న అదనపు ఖర్చు. ఎమ్మార్వోలు, ఆర్డీవోలు,…

అవును..ప్రభుత్వం సినిమా టికెట్ల మీద అనిశ్చిత వైఖరితో వుండడం, అలా అని కొత్త జీవో ను కచ్చితంగా అమలు చేయకపోవడం వల్ల ప్రతి జిల్లాలో అఖండ డిస్ట్రిబ్యూటర్లకు అవుతున్న అదనపు ఖర్చు. ఎమ్మార్వోలు, ఆర్డీవోలు, పోలీస్ డిపార్ట్ మెంట్, మీడియా ఇలా అందరికీ కలిసి పంచుతున్న మొత్తం ఇది. 

జీవో 35 అమలు చేయకుండా వుండడం కోసం, అదనపు రేట్లు అమ్ముకున్నా పట్టించుకోకుండా వుండడం కోసం, అదనపు షో లు వేసినా సైలంట్ గా వుండిపోవడం కోసం చేస్తున్న ఖర్చు ఇది. అంతే కాదు పనిలో పనిగా ఎమ్మెల్యేలను కూడా కలిసి, ముందుగానే ఓ మాట వేసి వుంచడం.

వకీల్ సాబ్ తో ఈ వ్యవహారం ప్రారంభం అయింది. కాస్త పెద్ద సినిమా అయితే చాలు ఈ ఖర్చు తప్పడం లేదు అని చెప్పారు ఓ డిస్ట్రిబ్యూటర్. కోట్లకు కోట్లు పెట్టి కొన్న సినిమా రికవరీ కావాలంటే ఇదో అదనపు ఖర్చుగా మారింది అన్నారు ఆ డిస్ట్రిబ్యూటర్.

పైగా గమ్మత్తేమిటంటే ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ చేయాలని అనుకుంటే ఇప్పటికే సి సెంటర్ల దగ్గర నుంచి అన్నీ ఆన్ లైన్ టికెట్ చేసే వున్నాయి. ఇప్పుడు అర్ఙెంట్ గా బి, సి సెంటర్లలో ఆన్ లైన్ టికెటింగ్ ఆపేసారు. ఆన్ లైన్ లో అమ్మితే కొత్త జీవో ప్రకారం 30 లేదా 70 అమ్మాలి. అందుకే ఆన్ లైన్ ఆపేసి, కౌంటర్ సేల్ యూనిఫారమ్ 100 రూపాయలు అమ్మడం ప్రారంభంచారు.

ఇదే కనుక ప్రభుత్వం సకాలంలో నిర్ణయం తీసుకుని వుంటే ఈ సమస్య వుండేది కాదు. ఈ వృధా ఖర్చు వుండేది కాదు. అసలు ప్రభుత్వమే కొంత ఫీజ్ తీసుకుని స్పెషల్ షో లకు అనుమతి ఇస్తే ఆ ఆదాయం ప్రభుత్వానికి వెళ్లేది. 

ఇప్పుడు అంతా పక్కదారిపడుతోంది. పైగా మంత్రి పేర్ని నాని అటు అసెంబ్లీలో, ఇటు బయట స్పెషల్ షో లు అనుమతించేది లేదు అని ఢంగా భజాయించి చెప్పారు. మరి జ‌రుగుతున్న వ్యవహారం అంతా మంత్రికి తెలియదు అనుకోవాలా? లేదా తెలిసీ ఊరుకుంటున్నారు అనుకోవాలా?

జ‌గన్ ప్రభుత్వం అటు అనుకూల నిర్ణయం తీసుకోవడం లేదు. అలా అని తీసుకున్న నిర్ణయం మీద వుండడం లేదు. దాని వల్ల మిడిల్ జ‌నాలు డబ్బులు చేసుకుంటున్నారు. డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతున్నారు.