‘దేశం’లో ఏం జరుగుతోంది?

ఒక్క ప‌క్క‌ ఢిల్లీలో లీగల్ బ్యాటిల్. మరో పక్క ఆంధ్రలో న్యాయ పోరాటం. ఈ మధ్యలో కనిపించని లోకేష్. Advertisement అన్నవరం సత్య దేవుడిని దర్శించుకుని మరీ రంగంలోకి దిగిన భువనేశ్వరి. ఇప్పటికే జనసేన…

ఒక్క ప‌క్క‌ ఢిల్లీలో లీగల్ బ్యాటిల్. మరో పక్క ఆంధ్రలో న్యాయ పోరాటం. ఈ మధ్యలో కనిపించని లోకేష్.

అన్నవరం సత్య దేవుడిని దర్శించుకుని మరీ రంగంలోకి దిగిన భువనేశ్వరి. ఇప్పటికే జనసేన శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తున్న నారా బ్రాహ్మిణి.  చంద్రబాబును కలవబోతున్న అచ్చెం నాయుడు.

అంటే ఏం జరుగుతోంది? బెయిల్ మీద ఆశలు సన్నగిల్లుతున్నాయా?

క్వాష్ వస్తుందన్న నమ్మకం లేదా? క్వాష్ రావడానికి చాన్స్ లు తక్కువ అని సంబంధిత నిపుణలు అంటున్నారు. ఎందుకంటే ఆ అవకాశం వుంటే హై కోర్టు లోనే వచ్చేది అంటున్నారు. అదంతా వేరే సంగతి.  బెయిల్ వచ్చినా, రాకున్నా జనంలోకి వెళ్లడానికి, పోరాడడానికి లోకేష్ వున్నారు. మళ్లీ త్వరలో యువగళం మొదలు పెడతా అని నిన్న ప్రకటించారు. ఆఫ్ కోర్స్ డేట్ చెప్పలేదనుకోండి.

మరి ఈ లోగా బ్రాహ్మిణి, భువనేశ్వరి ఎందుకు యాక్టివ్ అయ్యారు. వాళ్లని ఎందుకు ఎక్కువగా ఫోకస్ చేయాలని దేశం అనుకుల సామాజిక మీడియా ప్రయత్నిస్తోంది? అంటే బాబుగారి భార్య, కోడలు జనంలోకి వెళ్తే వచ్చే సింపతీ వేరుగా వుంటుంద‌ని భావిస్తున్నారా? లేక ఇప్పట్లో లోకేష్ జనంలో తిరగడం కష్టం అని అనుకుంటున్నారా?

మరోక్క ఇలా బ్రాహ్మిణిని, భువనేశ్వరిని జనంలోకి పంపితే జనసేన మనో భావాలు ఎలా వుంటాయి? తెలుగుదేశం కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసారు కానీ, జనసేనతో కలిసి ముందుకు సాగే కమిటీని మాత్రం ఇంకా ప్రకటించలేదు? ఎందుకని?

నాగబాబు సమావేశాల్లో ఏం మాట్లాడుతున్నారన్నది బయటకు వచ్చింది. దీనికి నాగబాబు లేదా జనసేన జనాలు ఖండించి వుండొచ్చు. కానీ తెలుగుదేశం దగ్గర వుండే సమాచారం దానికి వుంటుంది కదా? మరి నాగబాబు, అలాగే జనసేనలో కొంతమంది అభిప్రాయం అయినా ఇలా వుంది అని తెలిసినపుడు తెలుగుదేశం ఆలోచనలు ఎలా సాగబోతున్నాయి.

మొత్తం మీద చూస్తుంటే తెలుగుదేశం పార్టీ ఓ జంక్షన్ లో నిలబడిపోయినట్లు తెలుస్తోంది. ఎటు వెళ్లాలో, ఎలా వెళ్లాలో తెలియడం లేదు. కనిపిస్తున్న మార్గాలు అన్నీ ప్రయత్నిస్తూనో, ప్రయత్నించే ఆలోచనలోనో వున్నట్లు కనిపిస్తోంది.