గీతా సంస్థ రెండో బ్యానర్ ను గీతా2 అంటూ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆ బ్యానర్ మీద కాస్త స్పీడ్ గా సినిమాలు తీసే ఆలోచనలో వుంది. గీతా సంస్థలో చాలా స్క్రిప్ట్ లు టైమ్ కోసం వెయిట్ చేస్తుంటాయి. డైరక్టర్లు కూడా చాన్స్ కోసం వెయిట్ చేస్తుంటారు.
గీతాకు స్క్రిప్ట్ ఇచ్చినా, అడ్వాన్స్ తీసుకున్నా ఒకంతట సినిమాలు సెట్ మీదకు వెళ్లవు అనే టాక్ కూడా ఇండస్ట్రీలో వుంది. ఇప్పుడు ఈ టాక్ ను కూడా మార్చాలని గీతా సంస్థ చూస్తోంది.
ఇటు యువితో అటు డైరక్టర్ మారుతితో ఇలా రకరకాలుగా నిర్మాణ భాగస్వామ్యాలతో సినిమాలు చకచకా చేసే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే నిఖిల్ ను ఓ ప్రాజెక్టుకు లాక్ చేసారు. హీరో కార్తికేయ (ఆర్ఎక్స్100)ను ఓ సినిమాకు లాక్ చేసారు.
స్వంత హీరో అల్లు శిరీష్ తో ఓ సినిమా ఎలాగూ చేయక తప్పదు. ఎందుకంటే బయట నిర్మాతలు ప్రస్తుతానికి శిరీష్ తో సినిమా చేసే పరిస్థితి లేదు. అందువల్ల స్వంత బ్యానర్ లో ఓ సినిమా చేసే ఆలోచన వుంది. ఇది కాక, మరో ఒకరిద్దరు కుర్ర హీరోలతో కూడా సినిమాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తక్కువ బడ్జెట్ లో అంటే ఆరు నుంచి ఎనిమిది కోట్ల రేంజ్ లో సినిమా అయిపోయేలాగా, నాన్ థియేటర్ రైట్స్ తో మాగ్జిమమ్ సేఫ్ అయ్యేలా సినిమాలు తీయాలన్నది గీతా ప్లాన్ గా తెలుస్తోంది. అందుకు తగ్గ రేంజ్ హీరోలను ఎంచి తీసుకుని, లాక్ చేస్తున్నారు.
ఇలా చేయడం వల్ల థియేటర్లకు ఫీడింగ్, ఇంతో అంతో లాభం, అదే సమయంలో తమ దగ్గర వున్న స్క్రిప్ట్ లు క్లియర్ చేయడం లాంటి బహుముఖ ప్రయోజనాలు చూస్తున్నారు.