లోకేషా.. నాలుకే కాదు, మ‌తి కూడా మంద‌మే!

'సైకిల్ పోవాలి.. సైకిల్ పోవాలి..' ఈ నినాదాన్ని ఒక‌టికి ప‌ది సార్లు ఇస్తున్న‌ది మ‌రెవ‌రో కాదు. ఆ సైకిల్ గుర్తుపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో హోల్ అండ్ సోల్ అధికారాల‌ను వెన్నుపోటుతో పొందిన తండ్రీకొడుకులే! తెలుగుదేశం…

'సైకిల్ పోవాలి.. సైకిల్ పోవాలి..' ఈ నినాదాన్ని ఒక‌టికి ప‌ది సార్లు ఇస్తున్న‌ది మ‌రెవ‌రో కాదు. ఆ సైకిల్ గుర్తుపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో హోల్ అండ్ సోల్ అధికారాల‌ను వెన్నుపోటుతో పొందిన తండ్రీకొడుకులే! తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయ‌డు, ఆయ‌న త‌న‌యుడు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ లు ఈ మ‌ధ్య‌కాలంలో జ‌నం మ‌ధ్యకు వెళ్లి త‌ర‌చూ ఒక నినాదం ఇస్తున్నారు. అదే 'సైకిల్ పోవాలి..' అనేది!

ఇప్ప‌టికే చంద్ర‌బాబు నాయుడు 'సైకిల్ పోవాలి.. సైకిల్ పోవాలి..'అంటూ జ‌నం ముందు చెబుతూ, వారి చేత కూడా అదే ప‌లికించారు. ఆ వీడియోలు వైర‌ల్ గా సాగుతున్నాయి.

ఇక పాద‌యాత్ర అంటూ లోకేష్ బ‌య‌ల్దేరిప్పుడే ఇలాంటివి ఆయ‌న చేస్తాడ‌ని అంతా ఊహించారు. అందుకు త‌గ్గ‌ట్టుగా లోకేష్ మాట్లాడుతున్నారు. అంచ‌నాల‌ను నిజం చేస్తూ ఉన్నారు. ఇప్ప‌టికే త‌ను సెల‌విచ్చిన ఆణిముత్యాల‌కు తోడు ఇప్పుడు లోకేష్ *సైకిల్ పోవాలి* అని పిలుపునిచ్చారు!

సైకిల్ గుర్తుకు ఓటేస్తే మ‌న‌కు మ‌నం ఉరేసుకున్న‌ట్టే అని ఇప్ప‌టికి ప‌దేళ్ల కింద‌టే సెలవిచ్చిన లోకేషుడు ఇప్పుడు సైకిల్ పోవాలి అనే పిల‌పునూ ఇచ్చారు. పాద‌యాత్ర‌లో త‌న ప్ర‌సంగాల్లో ఇలాంటివెన్నో లోకేష్ చెబుతూ ఉన్నారు. 

మ‌రి చంద్ర‌బాబుకు అంటే వ‌య‌సైపోయింది ఆయ‌నేం మాట్లాడుతున్నార‌నే విజ్ఞ‌త కూడా ఆయ‌న‌కు ఉండ‌టం లేద‌ని అనుకోవ‌చ్చు. త‌ను తిరుప‌తికి రిగ్గింగ్ చేసుకోవ‌డానికి వెళ్తే అడ్డుకున్నారంటూ చంద్ర‌బాబు వాపోవ‌డం, సైకిల్ పోవాలి అని గ‌ట్టిగా ఒక‌టికి ప‌ది సార్లు నిన‌దించ‌డం అవ‌న్నీ చంద్ర‌బాబుకు ఆల్జీమ‌ర్స్ తాలూకు ల‌క్ష‌ణాలు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

మ‌రి ఇంత‌కీ లోకేష్ వ‌య‌సుకు ఆల్జీమ‌ర్స్ ఉండదు. బ‌హుశా ఆయ‌న మంద‌మ‌తికి ఇది తార్కాణం. ఇదేమీ అల‌వాట్లో పొర‌పాటు కాదు. ఒక‌సారో రెండు సార్లో లేదా మూడు సార్లో.. క‌నీసం ప‌ది ప‌దిహేను సార్లు చేసినా అల‌వాట్లో  పొర‌పాటు అనుకోవ‌చ్చు. అయితే లోకేష్ కు పుష్క‌ర‌కాలంగా ఇలాంటి పొర‌పాట్లే అల‌వాట‌య్యాయి. మ‌రి ఆయ‌నకు నాలుకే కాదు, మ‌తి కూడా మంద‌మే కాబోలు!