పవన్ గురించి వారికి జ్ఞానం వచ్చింది!

ఆయన పొత్తు పెట్టుకోడానికి తమకోసం వెంపర్లాడుతున్న రోజుల్లోనే.. ఆయన ఆఫీసుకు వెళ్లినప్పుడు.. లోనికి రానివ్వకుండా గేటు వద్ద నిల్చోబెట్టనప్పుడే వారికి క్లారిటీ వచ్చి ఉండాల్సింది. కానీ వారంతా అప్పుడు ఆయన మాయలో ఉన్నారు. ఆయనేదో…

ఆయన పొత్తు పెట్టుకోడానికి తమకోసం వెంపర్లాడుతున్న రోజుల్లోనే.. ఆయన ఆఫీసుకు వెళ్లినప్పుడు.. లోనికి రానివ్వకుండా గేటు వద్ద నిల్చోబెట్టనప్పుడే వారికి క్లారిటీ వచ్చి ఉండాల్సింది. కానీ వారంతా అప్పుడు ఆయన మాయలో ఉన్నారు. ఆయనేదో అద్భుతాలు సృష్టించేసి… తమను కూడా అధికారంలో భాగస్వాములుగా చేసేస్తారని కలలు కన్నారు. ఆయన ఇప్పుడు కమలదళం చంక ఎక్కి కూర్చోవడానికి కనబరుస్తున్న అత్యుత్సాహం చూసేసరికి వారికి కంపరం పుడుతోంది. పవన్ కల్యాణ్ గురించి ఇన్నాళ్లకు వామపక్ష నాయకులకు జ్ఞానం వచ్చినట్లుగా కనిపిస్తోంది.

పవన్ కల్యాణ్ 2014 ఎన్నికల్లో భాజపాతో కలిసి ఊరేగారు. అప్పటికే సొంత రాజకీయ పార్టీ పెట్టిన ఆయన వ్యూహాత్మకంగా ఎన్నికల్లో దిగకుండా, జగన్ ను ఓడించడమే లక్ష్యంగా మోడీ, చంద్రబాబు దళంతో కలిసి నడిచారు. అందుకు తన శక్తివంచనలేకుండా కృషి చేశారు. ఆ సందర్భాల్లో  మోడీని, భాజపాను వేనోళ్ల కీర్తించారు. ఆ తర్వాత.. కేంద్రం, రాష్ట్రంలో ఆ రెండు పార్టీల పాలనలో.. ఏపీ అభివృద్ధిని ఎలా నాశనం చేశారన్నదని అందరికీ తెలిసిందే.

వారి ఫెయిల్యూర్ పుణ్యమాని ప్రత్యమ్నాయరాజకీయ శక్తికి ఏపీలో అవకాశం ఉన్నదని, అది తననే వరిస్తుందని భ్రమించి.. ఎన్నికలకు ఏడాది ముందర పవన్ పార్టీని యాక్టివేట్ చేశారు. అప్పుడే నిద్రలేచి పాలకపార్టీ మీద పులిలా గర్జించారు. ఎన్నికల్లో పోరాడారు గానీ.. ఆయన అవకాశవాద రాజకీయం మీద ప్రజలెవ్వరికీ నమ్మకం లేదు. అతి దారుణంగా ఓడించారు. క్షేత్ర స్థాయిలో తన పార్టీకి పోలింగ్ ఏజంట్లకు  కూడా దిక్కులేని పవన్ కల్యాణ్ వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు. వారికి చాలా దారుణమైన సీట్లను కేటాయించారు. పార్టీని యాక్టివేట్ చేసిన తరుణంలో.. పార్టీ బలంగా కనిపించడానికి లెఫ్ట్ పార్టీలను బాగా వాడుకున్నారు.

తీరా ఇప్పుడు.. భాజపా అంటే తనకు ఇష్టమేనని, వారికి ఎప్పుడూ దూరం కాలేదని, అమిత్ షా లాంటి వారే దేశానికి కావాలని అనడం.. ఈ లెఫ్ట్ పార్టీలకు మింగుడుపడలేదు. తీరా ఇప్పుడు.. పవన్ ది అవకాశవాదం అంటూ.. సీపీఎం నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఆయన గురించి.. అసలు సంగతి గ్రహించడంలో ఇన్నాళ్లూ ఆ పార్టీ వారి రాజకీయ అనుభవం ఎందుకు ఫెయిలైందో మరి!