హైదరాబాద్ లో స్వలింగ సంపర్కుల రేవ్ పార్టీ

హైదరాబాద్ లో రేవ్ పార్టీ జరిగింది. దాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషాలు రెండు. ఒకటి ఈ పార్టీ కూకట్ పల్లి ప్రాంతంలో జరగడం, రెండోది పార్టీలో స్వలింగ సంపర్కులు హల్…

హైదరాబాద్ లో రేవ్ పార్టీ జరిగింది. దాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషాలు రెండు. ఒకటి ఈ పార్టీ కూకట్ పల్లి ప్రాంతంలో జరగడం, రెండోది పార్టీలో స్వలింగ సంపర్కులు హల్ చల్ చేయడం. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

కూకట్ పల్లిలోని వివేకానంద నగర్ లో ఉన్నట్టుండి అర్థరాత్రి అరుపులు, కేకలు, డీజే సౌండ్స్ వినిపించాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇంటిపై దాడులు నిర్వహించారు. 44 మంది కుర్రాళ్లతో పాటు ఇద్దరు హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. వీళ్ల వద్ద నుంచి మద్యం బాటిళ్లు, హుక్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీళ్లలో ఎక్కువమంది స్వలింగ సంపర్కులున్నట్టు పోలీసులు గుర్తించారు.

స్వలింగ సంపర్కులైన కొంతమంది యువకుల్ని ఇమ్రాన్, దయాల్ అనే ఇద్దరు వ్యక్తులు పోగేసి పార్టీలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇలాంటి పార్టీలకు ఎంట్రీ ఫీజుగా 300 రూపాయల్ని ఫిక్స్ చేసినట్టు చెబుతున్నారు. ఈ కార్యక్రమం మొత్తం పూర్తిగా చట్టవ్యతిరేకంగా జరిగిందంటున్నారు.

కార్యక్రమం నిర్వహకులపై పోలీసులు కేసు పెట్టారు. నిషేధిత హుక్కా వినియోగానికి సంబంధించి కూడా వాళ్లపై కేసు నమోదైంది. మిగిలిన యువకులపై చిన్న చిన్న కేసులు నమోదుచేశారు. వీళ్లందరికీ కౌన్సెలింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.