సిద్దార్ధ పేరు అఫీషియల్ గా

ఎన్నాళ్ల నుంచో నానుతోంది హీరో సిద్దార్ధ పేరు 'మహా సముద్రం' ప్రాజెక్టు కోసం. డైరక్టర్ అజయ్ భూపతి ప్రేమగా తయారు చేసుకున్న ఈ ప్రాజెక్టు చాలా చేతులు మారి ఆఖరికి నిర్మాత అనిల్ సుంకర…

ఎన్నాళ్ల నుంచో నానుతోంది హీరో సిద్దార్ధ పేరు 'మహా సముద్రం' ప్రాజెక్టు కోసం. డైరక్టర్ అజయ్ భూపతి ప్రేమగా తయారు చేసుకున్న ఈ ప్రాజెక్టు చాలా చేతులు మారి ఆఖరికి నిర్మాత అనిల్ సుంకర దగ్గర సెటిల్ అయింది. ఆర్ఎక్స్ 100 తరువాత చేస్తే ఈ ప్రాజెక్టు నే చేస్తానని పట్టుకుని కూర్చున్నారు అజయ్ భూపతి. మొత్తానికి ఇన్నాళ్లకు మెటీరియలైజ్ అవుతోంది.

ఇప్పటికే ఈ సినిమా కోసం శర్వానంద్ పేరు అఫీషియల్ గా ప్రకటించేసారు. ఇప్పుడు రెండో హీరోగా సిద్దార్ధ పేరును ప్రకటిస్తున్నారు. ఈ మేరకు నిర్మాత అనిల్ సుంకర నిన్నటికినిన్న ఓ ట్వీట్ వేసారు. ఇక హీరోయిన్ ఫిక్స్ కావాలి. కొన్నాళ్ల కిందట నుంచీ కీర్తి సురేష్ డేట్ ల కోసం ప్రయత్నించారు. అంతకు ముందు సమంత అనుకున్నారు. కానీ ఇప్పుడు సమంత చేసే అవకాశం లేదు.

మరి కీర్తి సురేష్ డేట్ లు దొరుకుతాయా? అన్నది అనుమానం. ఎందుకుంటే ఆమె మహేష్ బాబు సర్కారువారి పాట లో చేస్తున్నారు. మరి తరువాత ఛాయిస్ ఎవరో? సాయి ఫల్లవి ఒక ఆప్షన్ గా వినిపిస్తోంది. మరి కొన్ని రోజుల్లో అనిల్ సుంకర హీరోయిన్ ట్వీట్ కూడా వేస్తారేమో?

లేని పోని ఇబ్బందులు అనే ఆలోచనా?