త‌న క‌ల‌ల‌ను రేప్ చేశారంటున్న హీరోయిన్

ముంబైలోని త‌న ఆఫీసును కార్పొరేష‌న్ వాళ్లు కూల్చి వేయ‌డంపై మ‌రోసారి స్పందించింది న‌టి కంగ‌నా ర‌నౌత్.  కూల్చివేసిన త‌న ఆఫీసుకు సంబంధించిన శిథిలాల ఫొటోల‌ను పోస్టు చేస్తూ.. ఆమె తీవ్ర‌మైన వ్యాఖ్యలు చేసింది. త‌న…

ముంబైలోని త‌న ఆఫీసును కార్పొరేష‌న్ వాళ్లు కూల్చి వేయ‌డంపై మ‌రోసారి స్పందించింది న‌టి కంగ‌నా ర‌నౌత్.  కూల్చివేసిన త‌న ఆఫీసుకు సంబంధించిన శిథిలాల ఫొటోల‌ను పోస్టు చేస్తూ.. ఆమె తీవ్ర‌మైన వ్యాఖ్యలు చేసింది. త‌న స్వ‌ప్నాల‌ను రేప్ చేశారు.. అంటూ ఆమె ట్వీట్ చేసింది. త‌న క‌ల‌ల సౌధాన్ని కూల్చేశార‌ని వాపోయింది. త‌న క‌ల‌ల‌ను, త‌న ప్రేర‌ణ‌ను, త‌న భ‌విష్య‌త్తును అత్యాచారం చేశారంటూ ఆమె రాసుకొచ్చింది. 

'వాళ్లు ఏం చేశారు?  రేప్ కాదా?' అంటూ ప్ర‌శ్నించింది. త‌న దేవాల‌యం శ్మ‌శానంగా మారిందంటూ కంగ‌నా వాపోయింది. వాళ్లు త‌న స్వ‌ప్నాల‌ను విచ్ఛిన్నం చేశారంటూ ప‌దే ప‌దే పేర్కొంది కంగ‌నా.

అక్ర‌మ భ‌వంతి అంటూ కంగ‌నా ఆఫీసును బీఎంసీ వాళ్లు కూల్చేశారు. అలాగే ఆమ ఫ్లాట్ ఉన్న అపార్ట్ మెంట్ కూడా నోటీసులు ఇచ్చింది బాంబే కార్పొరేష‌న్. అందులో కూడా ప‌లు నియ‌మాల‌ను అతిక్ర‌మించార‌ని పేర్కొంది. ఈ విష‌యంపై కంగ‌నా ఫైర్ అవుతోంది. త‌న ఆఫీసు ను కూల‌దోయ‌డంపై ఆమె కోర్టుకు ఎక్కింది. ఈ వ్య‌వ‌హారంలో బీఎంసీ నుంచి రెండు కోట్ల రూపాయ‌ల ప‌రిహారాన్ని ఆమె కోరుతోంద‌ని స‌మాచారం.

లేని పోని ఇబ్బందులు అనే ఆలోచనా?