తనను తప్పు పట్టిన వారిపై అత్యంత తీవ్రంగా స్పందిస్తూ ఉంది నటి కంగనా రనౌత్. తను చెప్పిన వాళ్లు, తను తప్ప మరెవరూ మంచి వాళ్లు కాదన్నట్టుగా వ్యవహరిస్తున్న ఈ నటీమణి హద్దు మీరి మాట్లాడుతూ ఉంది. తనతో ఏకీభవించిన వారిని తీవ్రంగా దూషించడానికి, వారి పట్ల అనుచితంగా మాట్లాడటానికీ ఈమె వెనుకాడకపోవడం గమనార్హం.
ఇప్పటికే జయాబచ్చన్ పై విరుచుకుపడుతూ అభిషేక్ బచ్చన్ ఆత్మహత్య చేసుకుని ఉంటే జయకు ఆ బాధ తెలిసేదన్నట్టుగా మాట్లాడింది కంగనా. జయబచ్చన్ పై అభ్యంతరాలు ఉంటే ఆమె గురించి మాట్లాడటం ఒక పద్ధతి. జయ తనయుడు ఆత్మహత్య చేసుకుని ఉంటే.. అంటూ కంగనా మాట్లాడటం మాత్రం ఆమెకే తెలిసిన పద్ధతి!
ఈ అనుచితమైన పద్ధతిలోనే కంగనా రెచ్చిపోతోంది. ఈ క్రమంలో మరో నటిమణిపై ఈమె నోరు పారేసుకుంది. నటి ఊర్మిలను ఉద్దేశించి సాప్ట్ పోర్న్ స్టార్ అంటూ వ్యాఖ్యానించింది కంగనా. ఆమెకు నటన రాదని, ఆమె ఒక సాప్ట్ పోర్న్ స్టార్ అని కంగనా వ్యాఖ్యానించింది. ఇటీవలే కంగనా తీరును తప్పు పడుతూ స్పందించి ఊర్మిల. దీంతో కంగనా ఇలా రెచ్చిపోయింది.
ఊర్మిలను విమర్శించాలనుకుంటే కంగనా విమర్శించుకోవచ్చు కానీ, తనేదో మహానటి అయినట్టుగా.. తనదో స్కిన్ షో చేయలేదన్నట్టుగా.. ఊర్మిలను సాఫ్ట్ పోర్న్ స్టార్ అంటూ వ్యాఖ్యానించడం హేయం. ఊర్మిల సాఫ్ట్ పోర్న్ స్టార్ అయితే.. కంగనా ను ఏమని పిలవాలో!