మార్గదర్శకాలు సరే.. అమలు సాధ్యమేనా?

అన్ లాక్ అంటూ దశలవారీగా అన్నీ తెరుస్తూ చేతులు దులుపుకుంటోంది కేంద్రం. ఈ క్రమంలో స్కూల్స్ రీ-ఓపెనింగ్ పై కూడా మార్గదర్శకాలు వచ్చేశాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిస్థితులకు తగ్గట్టు పాఠశాలలు తెరవడంపై…

అన్ లాక్ అంటూ దశలవారీగా అన్నీ తెరుస్తూ చేతులు దులుపుకుంటోంది కేంద్రం. ఈ క్రమంలో స్కూల్స్ రీ-ఓపెనింగ్ పై కూడా మార్గదర్శకాలు వచ్చేశాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిస్థితులకు తగ్గట్టు పాఠశాలలు తెరవడంపై గైడ్ లైన్స్ ఇచ్చాయి. అయితే మార్గదర్శకాలు బాగున్నాయి కానీ ఆచరణలో ఇది సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఉదాహరణకు పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్లు ఆరడుగుల దూరం పాటించేలా నిబంధన విధించారు. అసలే ఇరుకు గదుల స్కూల్స్ ఎక్కువ. ఇలాంటి గదుల్లో పిల్లల మధ్య 6 అడుగుల దూరం అంటే అసాధ్యం. మాస్కులు పెట్టుకునేలా, శానిటైజర్లు రాసుకునేలా నిబంధనలు విధించొచ్చు కానీ.. ఈ 6 అడుగుల దూరం అనేది మాత్రం అసంభవం.

ఇక విద్యార్థులు.. తమలో తాము పెన్సిల్స్, పెన్నులు, పుస్తకాలు ఇచ్చిపుచ్చుకునేలా చేయాలనేది మరో నిబంధన. ఇది ఎక్కడైనా సాధ్యమౌతుందా? పిల్లలన్న తర్వాత ఇచ్చిపుచ్చుకోవడం సహజం. దీన్ని నియంత్రించడం ఎలా. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకే క్లాసులు పెట్టారు కాబట్టి.. వాళ్లకు చెబితే అర్థం చేసుకుంటారని అధికారులు అంటున్నారు. కానీ ఇది నూటికి నూరుపాళ్లు ఆచరణ సాధ్యమేనా అంటే మాత్రం అధికారులే మౌనం వహిస్తున్నారు.

ఇలా కేంద్రం విధించిన మార్గదర్శకాల్లో దాదాపు సగానికి పైగా నిబంధనలు ఆచరణకు దూరంగా ఉన్నాయి. తరగతి గదులు, ప్రయోగశాలలు, ఇతర వినియోగప్రాంతాల్ని నిర్ణీత సమయాల్లో ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలనే నిబంధనను నిజంగానే గవర్నమెంట్ స్కూళ్లను దృష్టిలో పెట్టుకొని విధించారా అనే అనుమానం కలగకమానదు. 

ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు తరగతులు లేవని, వాళ్లను ఇంటికే పరిమితం చేసి, వివిధ మాధ్యమాల ద్వారా విద్యాబోధన చేయాలనే నిబంధన ఉన్నంతలో సహేతుకంగా కనిపిస్తున్నప్పటికీ.. వాళ్లకు ఇంట్లోనే తరగతులు చెప్పే విధానం క్షేత్రస్థాయిలో ఏ మేరకు సత్ఫలితాలనిస్తుందనేది చూడాలి.

చంద్రబాబుకి నిద్ర లేకుండా చేస్తున్న అమరావతి

బోండా ఉమకి నిన్న రాత్రే ఎలా తెలిసిపోయింది