అంబటి చెప్పిందే జరుగుతుందా.. బాబు బుక్కయినట్టేనా!

అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి భవిష్యత్తులో జరగబోయేది ఏంటనే విషయాన్ని వైసీపీ ప్రతినిధి అంబటి రాంబాబు చూచాయగా బయటపెట్టారు. భ్రమరావతి మాయలపై అంబటి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు ఓ కన్నేశారు.  Advertisement…

అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి భవిష్యత్తులో జరగబోయేది ఏంటనే విషయాన్ని వైసీపీ ప్రతినిధి అంబటి రాంబాబు చూచాయగా బయటపెట్టారు. భ్రమరావతి మాయలపై అంబటి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు ఓ కన్నేశారు. 

రాబోయే రోజుల్లో అంబటి చెప్పిందే జరుగుతుందంటున్నారు. అంబటి ప్రెస్ మీట్ ను సునిశితంగా గమనిస్తే.. టీడీపీ నేతలకు విషయం అర్థమైపోతుందంటున్నారు. ఇంతకీ అంబటి ఏం చెప్పారు..

పాయింట్-1 : త్వరలోనే ఆశ్చర్యకర విషయాలు వింటారు

అంబటి రాంబాబు చెప్పిన విషయాల్లో అత్యంత కీలకమైనది ఇదే. ఇన్నాళ్లూ తమనితాము స్వచ్ఛంగా చెప్పుకున్న వ్యక్తులు, అవినీతిమరక అంటే ఏంటో తెలియదని చెప్పుకున్న నేతలు.. తాజా భూ కుంభకోణంలో బయటపడబోతున్నారు.

పాయింట్-2 : సీబీఐ విచారణ కూడా జరుగుతుంది

దమ్ముంటే విచారణ జరిపించండంటూ ఇన్నాళ్లూ కొంతమంది ప్రగల్బాలు పలికారని.. ఇప్పుడు ఆ విచారణ జరిగే సమయం వచ్చిందంటున్నారు. అంతేకాదు.. ప్రస్తుతం ఏసీబీ విచారిస్తున్న అమరావతి భూ కుంభకోణం కేసు.. త్వరలోనే సీబీఐ చేతికి కూడా వెళ్తుందని హింట్ ఇచ్చారు.

పాయింట్-3 : అత్యంత ప్రముఖుల గుట్టు రట్టవుతుంది

ఇది రాజకీయాలతో సంబంధం లేకుండా, తెరవెనక ఉంటూ రాజకీయాలు నడిపించే వాళ్ల కోసం. వీళ్లు రాజకీయ ముఖచిత్రంపై కనిపించరు. కానీ రాజకీయ నేతల్ని శాసిస్తారు. వీళ్లు కొంతమంది కీలక రాజకీయ నేతలకు బంధువులు కావొచ్చు. మరికొంతమంది వ్యాపార సంస్థల యజమానాలు కావొచ్చు. డబ్బుతో ఏదైనా చేయొచ్చనుకునే ఇలాంటి వాళ్ల గుట్టు త్వరలోనే రట్టవుతుంది.

పాయింట్-4 : 15 నెలల టైమ్ తీసుకున్నది అందుకే!

అధికారంలోకి వచ్చి 15 నెలలైనా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఒక్క అవినీతి కేసు కూడా చూపించలేకపోయారంటూ టీడీపీ నేతలు ఇన్నాళ్లూ వాదిస్తూ వచ్చారు. అయితే గ్రౌండ్ వర్క్ కోసమే ఇంత టైమ్ తీసుకున్నామని, అన్ని ఆధారాలు దొరికిన తర్వాతే ఏసీబీ రంగంలోకి దిగిందని అంబటి రాంబాబు ప్రెస్ మీట్ వింటే అర్థమౌతోంది.

ఫైనల్ గా…

ఓవరాల్ గా అమరావతి భూ కుంభకోణం ఈసారి చంద్రబాబు, ఆయన తనయుడు మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రాజ్యాంగపరంగా, చట్టపరంగా ఇలాంటి కేసులు తేలడానికి ఎక్కువ సమయం పట్టినప్పటికీ.. అంతిమంగా తండ్రికొడుకులిద్దరూ జైలుపాలవ్వడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.  

నాగ‌బాబూ …మ‌రీ ఇంత దిగ‌జారుడేంది?

నాకు లవ్ స్టోరీలు నచ్చవు.. హెబ్బా