ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తిరుగుబాటు బావుటా ఎగుర వేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఎల్లో మీడియా అక్కున చేర్చుకుంది. జగన్‌ను తిట్టించేందుకు ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ ఆర్కే రెడీ అయిపోయారు.
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనే కార్యక్రమం రాజకీయ కోణంలో చూస్తే కేవలం జగన్‌పై విషం చిమ్మడానికే అనే అభిప్రాయం లేకపోలేదు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడ్డమే ఆలస్యం, వెంటనే ఆయన్ను తమ స్టూడియోకు ఆర్కే పిలిపించుకున్నారు.
ఈ ఇంటర్వ్యూలో అతి పెద్ద కామెడీ ఏంటంటే… మాట్లాడ్డానికి జగన్ తన వద్దకు వస్తానంటే, వద్దన్నానని ఆర్కే చెప్పడం. సోనియాగాంధీనే లెక్క చేయని వైఎస్ జగన్…. ఆర్కే లాంటి వాళ్లను లెక్కలోకి తీసుకుంటారని ఎవరైనా అంటే… హాస్యం కాకుండా మరేమవుతుంది. కోటంరెడ్డితో ఆర్కే ప్రత్యేక ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో ఆసక్తికర విషయం గురించి తెలుసుకుందాం.
ఈనాడు మీడియాధిపతి రామోజీరావు దగ్గరికి జగన్ వెళ్లినప్పుడు మంచి పని చేశావని అభినందించినట్టు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. అదే విధంగా రాధాకృష్ణను కూడా కలిసేందుకు ఆలోచించాలని కోరినట్టు కోటంరెడ్డి చెప్పుకొచ్చారు. కోటంరెడ్డి వ్యాఖ్యలపై ఆర్కే స్పందన పడిపడి నవ్వుకునేలా వుంది.
జగన్, తాను ఉత్తరదక్షిణ ధృవాలని ఆర్కే అన్నారు. కలవడం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. అందుకని జగన్ వస్తానని చెప్పినా వద్దని చెప్పినట్టు ఆర్కే చెప్పడం గమనార్హం. ఎవరినైనా శత్రువుగా భావిస్తే… జగన్ ఎలా వ్యవహరిస్తారో ఇదే ఇంటర్వ్యూలో ఆర్కే చెప్పారు. అలాంటిది తన దగ్గరికి జగన్ వస్తానన్నారని ఆర్కే ఎలా చెప్పారో ఆయనకే తెలియాలి. ఆర్కే కామెడీ భలే భలే అని సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి.