తన తరువాత సినిమా ఏమిటన్నదానిపై నాగ్ చైతన్య క్లారిటీ ఇవ్వడం లేదు ఇప్పటి వరకు. వెంకీమామ విడుదలకు సిద్ధం అవుతోంది. శేఖర్ కమ్ముల సినిమా ఫిబ్రవరికి వస్తుంది. ఇలాంటి టైమ్ లో అజయ్ భూపతి, పరుశురామ్ బుజ్జిల ప్రాజెక్టులు ఓకె అనిపించుకోవడం కోసం రెడీగా వున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎవ్వరకీ పక్కా క్లారిటీ ఇవ్వలేదు.
వెంకీమామ విడుదల కోసమే చైతూ వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు అన్నీ నాలుగు నుంచి అయిదు కోట్ల రేంజ్ లో రెమ్యూనిరేషన్ తీసుకున్నవి. ఆరు కోట్లకు తన రెమ్యూనిరేషన్ చేర్చాలనే ఆలోచనలో చైతూ వున్నట్లు బోగట్టా.
అలా చేయాలంటే మరో హిట్ పడాలి. అందుకోసమే వెంకీమామ సినిమా ఫలితం కోసం చైతూ వెయిట్ చేస్తున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అటు జెమిని కిరణ్ అయినా, ఇటు 14 రీల్స్ అయినా ప్రాజెక్టు ఓకే చేసుకోవచ్చు కానీ రెమ్యూనిరేషన్ ఫిక్స్ కోసం మాత్రం వెంకీ మామ విడుదల వరకు వెయిట్ చేయాలేమో? ఆ సినిమా హిట్ అయితే ఆరు కోట్లు ఇవ్వడానికి రెడీ కావాలి అన్నది టాలీవుడ్ లో వినిపిస్తున్న సంగతి.