ప‌దేప‌దే భార్య ప్ర‌స్తావ‌న‌…ఛీఛీ!

తుపాను దెబ్బ‌కు స‌ర్వం కోల్పోయిన బాధితుల వ‌ద్ద‌కు టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు ఓదార్చ‌డానికా లేక ఓదార్పు కోసం వెళ్లారా? అనేది అర్థం కావ‌డం లేదు.  Advertisement కుటుంబ స‌భ్యులు, ఆప్తులు కోల్పోయి పుట్టెడు దుఃఖంలో…

తుపాను దెబ్బ‌కు స‌ర్వం కోల్పోయిన బాధితుల వ‌ద్ద‌కు టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు ఓదార్చ‌డానికా లేక ఓదార్పు కోసం వెళ్లారా? అనేది అర్థం కావ‌డం లేదు. 

కుటుంబ స‌భ్యులు, ఆప్తులు కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న గ్రామీణుల వ‌ద్ద‌కు ఓదార్పు పేరుతో వెళ్లి ….అక్క‌డ కూడా త‌న స‌తీమ‌ణిని దూషించారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఛీఛీ అంటూ, ఇంత దిగ‌జారుడా అని పౌర స‌మాజం ఈస‌డించుకుంటోంది. రాజ‌కీయాల‌కు మ‌రో వేదిక‌ను ఎంచుకుని వుంటే బాగుండేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

వైఎస్సార్‌ జిల్లా చెయ్యేరు ముంపు గ్రామాలు మందపల్లె, పులపుత్తూరు, నందలూరు, గుండ్లూరు, అగస్తాపురం గ్రామాల్లో, రాజం పేటలో మంగళవారం మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పర్యటించారు. ఇటీవ‌ల అన్న‌మ‌య్య ప్రాజెక్టు తెగిపోయి… గ్రామాల‌కు గ్రామాలే ముంపున‌కు గురి అయ్యాయి. 

ప‌దుల సంఖ్య‌లో ప్రాణ న‌ష్టం జ‌రిగింది. కోట్లాది రూపాయ‌ల ఆస్తి న‌ష్టం సంభ‌వించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో క‌ట్టుబ‌ట్ట‌ల‌తో మిగిలిన బాధితుల‌ను నేరుగా ప‌రామ‌ర్శించ‌డానికి చంద్ర‌బాబు వెళ్ల‌డం అభినందనీయం. అయితే బాధితుల ద‌గ్గ‌ర కూడా త‌న గోడు వినిపించ‌డ‌మే అభ్యంత‌ర‌క‌రంగా ఉంది.  

మందపల్లె, రాజంపేటలో బాధితులనుద్దేశించి చంద్ర‌బాబు మాట్లాడారు. మాజీ ముఖ్య‌మంత్రి ఏమ‌న్నారో, ఆయ‌న మాటల్లోనే…  

‘క్లెమోర్‌ మైన్స్‌ తట్టుకున్న ఈ శరీరం.. నా భార్యను అవమానపరిచేలా మాట్లాడితే తట్టుకోలేకపోయాను. మా ఇంటిపై దాడి చేశారు. ఆఫీసుపై దాడి చేశారు. చివరకు నా భార్యను, కుటుంబాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో వ్యవసాయం గురించి చర్చ సందర్భంగా మీకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిద్దామనుకుంటే చివరకు నా భార్యను కూడా అవమానించారు. అది గౌరవ శాసనసభ కాదు. కౌరవసభ’ అని చంద్రబాబు త‌న మార్క్ విమ‌ర్శ‌ల పంచ్‌లు విసిరారు.

బాధితుల‌కు భ‌రోసా క‌ల్పించే మాట‌ల వ‌ర‌కే ప‌రిమిత‌మై వుంటే బాగుండేది. కానీ బాధితుల నుంచి ఓదార్పు, సానుభూతి పొందాల‌నే చంద్ర‌బాబు ఛీప్ ట్రిక్స్ ఎబ్బెట్టుగా ఉన్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప‌దేప‌దే త‌న భార్య విష‌యాన్ని ప్ర‌స్తావించ‌డం ద్వారా రాజ‌కీయ ల‌బ్ధి సంగ‌తి దేవుడెరుగు…. ఆమెని బ‌జారుకీడుస్తున్న‌ట్టుగా ఉంద‌ని చంద్ర‌బాబు గ్ర‌హిస్తే మంచిద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు హిత‌వు చెబుతున్నారు. 

ఎందుకంటే బాబు స‌తీమ‌ణిని దూషించిన వాళ్ల కంటే, దాన్ని రాజ‌కీయంగా సొమ్ము చేసుకోవాల‌నే బాబు స్వార్థ‌మే ఎక్కువ అస‌హ్యం క‌లిగించేలా ఉందంటున్నారు.