శౌర్య మాస్ యాంగిల్ అశ్వద్ధామ

ఫ్యామిలీ, లవ్ లీ ఇమేజ్ వున్న హీరో నాగశౌర్య చేస్తున్న యాక్షన్ ఓరియేంటెడ్ సినిమా అశ్వధామ. తమ స్యంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ను ఈ…

ఫ్యామిలీ, లవ్ లీ ఇమేజ్ వున్న హీరో నాగశౌర్య చేస్తున్న యాక్షన్ ఓరియేంటెడ్ సినిమా అశ్వధామ. తమ స్యంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ను ఈ రోజు విడుదల చేసారు. దాదాపు సినిమా కాన్సెప్ట్ చెప్పే టీజర్ మాదిరిగా కట్ చేసారు. కలర్ టింట్ లో ఏవేవో సన్నివేశాలు చూపిస్తూ,  చివర్న మజిల్ పవర్ తో నాగశౌర్య ను చూపించారు.

పూర్తి ఇన్వెస్టిగేషన్, యాక్షన్ థ్రిల్లర్ గా అశ్వద్ధామను తయారుచేస్తున్నారు. వర్తమాన సమాజంలో దారుణంగా తయారైన ఓ సమస్య నే ఈ సినిమాకు స్టోరీ పాయింట్ గా వుంటుంది. సినిమా అంతా వైజాగ్ నేపథ్యంలో జరుగుతుంది. 

కేజీఎఫ్ ఫైట్ మాస్టర్ అశ్వద్ధామ సినిమాకు పని చేసారు. ఈ సినిమాకు ఫైట్ చేస్తున్నపుడే నాగశౌర్య కాలికి గట్టి గాయం తగిలింది. సినిమాలో నాగశౌర్యకు జంటగా మెహరీన్ నటిస్తోంది.