త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ సినిమా. ఇలా అంటే చాలు మొత్తం వికీపీడియా మాదిరిగా వివరాలు చెప్పేస్తారు సినిమా అభిమానులు. అంత పాపులర్ అయిపోయింది. రెండు పాటలు బ్లాక్ బస్టర్ కావడం పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఇక టీజర్, ట్రయిలర్ లాంటి వ్యవహారాలు వున్నాయి. ప్రీ రిలీజ్ ఫంక్షన్ వుండనే వుంది.
ఇంత పాపులర్ అయ్యాక ఇక రోజు వారీ, వారాల వారీ ఏదో ఒకటి వదలడం, హడావుడి చేయడం అనవసరం అని డిసైడ్ అయిందట అల యూనిట్. ఊ పోటీ పడిపోయి, రోజూ నో, వారానికో ఏదో ఒక కంటెంట్ వదలడం, హడావుడి చేయడం అనవసరం అని, ఆ టైమ్ ను పోస్ట్ ప్రోడక్షన్ క్వాలిటీ మీద, సినిమా రిలీజ్ మీద పెట్టాలని త్రివిక్రమ్ తో పాటు నిర్మాత రాధాకృష్ణ డిసైడ్ అయ్యారు.
డిసెంబర్ రెండు లేదా మూడున టీజర్ వదలడం, ఆపై వీలయితే ఓ సాంగ్ వదలడం అంతే ఇప్పటికి డిసైడ్ అయిన కార్యక్రమాలు. మూడో వారంలో ట్రయిలర్, ఆ తరువాత ఆంధ్రలో, తెలంగాణలో రెండు ఫంక్షన్ లు అంతే.
అంతే కానీ వారం వారం, రేపే వస్తోంది, ఇదిగో వస్తోంది, గంటలో వస్తోంది, ఇలాంటి హడావుడలు అన్నీ తగ్గించేస్తారట. రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్లను ఒకదానికి మరోటి భిన్నంగా వుండేలా ప్లాన్ చేస్తున్నారు. వేరు వేరు చోట్ల రెండు ఒకటేలాంటి ఫంక్షన్లు చేయడం కాకుండా, వేరు వేరు మోడళ్లలో ఫంక్షన్ లు వుండాలని డిజైన్ చేస్తున్నారు.